Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహిళలకు పై పెదవి యందు పుట్టుమచ్చ ఉన్నచో..!

మహిళలకు పై పెదవి యందు పుట్టుమచ్చ ఉన్నచో..!
, శుక్రవారం, 7 అక్టోబరు 2011 (16:35 IST)
FILE
మహిళలకు పై పెదవి యందు గాని క్రింది పెదవియందుగాని పుట్టుమచ్చ వున్నచో సిరిసంపదలతో తులతూగుతారు. పుట్టుమచ్చను కలిగివుండే స్త్రీలు మంచినడవడిక గలిగి వుంటారు. సుగంధాది వస్తువులను ఇష్టపడతారు. పై పెదవికి లోపలి భాగమున మచ్చవున్నచో ఆ స్త్రీలు వ్రతములు చేయడంలో ఆసక్తి కలిగి వుంటారు.

క్రింది పెదవికి లోపలిభాగమున పుట్టుమచ్చ వున్నచో ఆ స్త్రీ దుష్ప్రవర్తన కలిగివుండును. కఠిన చిత్తమును కలిగి వుండును బంధుమిత్రాదులతో దగవులాడుచుండును. మొత్తం మీద ఆ స్త్రీని గృహరాక్షసి అని చెప్తారు.

ఇక నాలుకకు పై భాగమున పుట్టుమచ్చ వున్నచో ఆ స్త్రీ నిరంతరం హరిచరణారవిందసేవను జేయుచుండును. కోకిలను పోలిన కంఠ స్వరాన్ని కలిగివుండును. సకల సౌఖ్యములను అనుభవించును.

ఆ మచ్చ నాలుకకు క్రిందిభాగమున ఉన్నచో వ్రతముల కొరకు, నోముల కొరకు ధనము విరివిగా ఖర్చు చేయించును. తీర్థయాత్రలు చేస్తారు. దానధర్మములు అమితముగా చేయుచుండునని జ్యోతిష్య నిపుణులు చెబుతుంటారు.

Share this Story:

Follow Webdunia telugu