Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏదైనా రాసేటప్పుడు పేపరు పైన "శ్రీ"కారం రాస్తారెందుకు?

ఏదైనా రాసేటప్పుడు పేపరు పైన
FILE
"శ్రీ" లక్ష్మీ ప్రదమైనది మంగళరకరమైనది మరియు మోక్షదాయకమైనది. "శ్రీ"కారమున "శవర్ణ", "రేఫ", 'ఈ' కారములు చేరి 'శ్రీ' అయినది. అందు శవర్ణ, ఈ కారములకు లక్ష్మీదేవి అధిదేవత. రేపము నకు అగ్ని దేవుడు అధిదేవత.

"శ్రియ మిచ్దేద్దు తాశనాత్"! అను పురాణ వచనానుసారముగా అగ్నీలక్ష్మీప్రదుడే, శుభకరుడే. ఈ విధంగా "శ్రీ"లోగ మూడు వర్ణములకు శుభదేవతలే కారకులు. ఇంకా "శ" వర్ణమునకు గ్రహము 'గురుడు', 'రేఫ', 'ఈ ' కారములకు గ్రహములు 'గురుడు', 'శుక్రుడు'. గురు, శుక్ర గ్రహములు రెండూ శుభకరులే కావున "శ్రీ" శుభాన్ని సూచిస్తుంది. శుభాన్ని కోరుతుంది.

నిఘంటువులో 'కమలా శ్రీర్హరి ప్రియా' అని ఉండటంతో, లక్ష్మీ నామాలతో 'శ్రీ' ఒకటి అని తెలుస్తోంది. కావున ఇది శుభవాచకమైనది. ఇన్ని విధాలుగా 'శ్రీ' సర్వశ్రేష్టవాచకమైనది. ప్రతి శుభకార్యానికి, 'శ్రీ'కారం తలమానికమై వెలుగొందుచున్నది.

"శ్రీ" శుభసూచికయేకాదు, గౌరవప్రదమైనది కూడా. ఏ ప్రాంతమైందననూ, ఏ భాషయందైననూ 'శ్రీ' అను పదము గౌరవ సూచకముగా, శుభసూచకముగా వాడుతుంటారు.

Share this Story:

Follow Webdunia telugu