Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అశ్విని నక్షత్రములో పుట్టిన పురుషులు ఎలా ఉంటారంటే!?

అశ్విని నక్షత్రములో పుట్టిన పురుషులు ఎలా ఉంటారంటే!?
FILE
అశ్విని నక్షత్రము తొలిపాదములో జన్మించిన పురుషులు ధైర్యం గలవారుగా ఉంటారు. కానీ చాడీలు చెప్పే నైజం వీరిది. అందుచేత వీరికి స్నేహితులు తక్కువగా ఉంటారు. ఈశ్వర ధర్మాన్ని ఉపేక్షించే ఈ జాతకులు ఇతరుల సహాయం చేసేందుకు ముందడుగు వేయరు.

అలాగే అశ్విని రెండో పాదములో పుట్టిన పురుషులు అన్ని విషయాల పట్ల అవగాహన, జ్ఞానం కలవారుగా ఉంటారు. విశేషమైన శాస్త్ర అర్థములు తెలిసివారుగా రాణిస్తారు సంగీత కళా విద్యలయందు సమర్థులు. అతిథి సత్కారము చేయడంలో ముందుంటారు. చూసిన వెంటనే తన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను సంతోషపెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఇతరుల మంచి చెడులందు మంచిని మాత్రమే విశ్వసిస్తారు.

ఇక అశ్విని మూడో పాదములో జన్మించిన పురుషులు గణిత విద్యయందు సమర్థులు. కావ్య రచనలో మేధాశక్తి కలవారుగా ఉంటారు. ప్రసన్నులు, ఇతరులకు మంచి చెడుల గురించి బాగా బోధపరుచుతారు. కానీ పట్టుదల కలవారుగా ఉంటారు. అశ్విని నక్షత్రము నాలుగో పాదములో జన్మించిన పురుషుడు మేధాశక్తి కలవారు. సౌందర్యాన్ని ఆస్వాదించే వ్యక్తిగానూ, సత్యవాదిగానూ ఉంటారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu