Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమావాస్య, మహాలయ పక్షాల్లో పెరుగన్నం దానం చేస్తే?

అమావాస్య, మహాలయ పక్షాల్లో పెరుగన్నం దానం చేస్తే?
, శనివారం, 1 ఫిబ్రవరి 2014 (18:44 IST)
FILE
సిద్ధి వినాయకస్వామిని స్వర్ణ గౌరిని నీటిలో వదిలే సమయంలో పెరుగన్నం నైవేద్యంగా చేసి తిన్నా-దానం చేసినా మీ ఇంట్లో ప్రశాంతత, శాంతి, సంతోషం నెలకొంటాయని పండితులు అంటున్నారు. అలాగే అమావాస్య రోజు, మహాలయ పక్షాల సమయంలో పెరుగన్నం దానం చేస్తే అన్ని పితృశాపాలు తొలగిపోతాయి.

అలాగే కులదేవతలకు పెరుగన్నాన్ని నైవేద్యంగా పెడితే మీ ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. శనివారం రోజు కులదేవతలకు పెరుగన్నం నైవేద్యంగా పెడితే ఇంట్లో అప్పుల బాధలు ఉండవు. పెరుగన్నాన్ని దానిమ్మ పండు గింజలను కలిపి కులదేవతలకు నైవేద్యం చేసి, దానం చేస్తే శత్రువుల బాధ తొలగిపోతుంది.

ఇంకా శనివారం రోజు స్టీలు పళ్లెంలో అరటి ఆకు పెట్టి దానిపై పెరుగన్నం పెట్టి, పళ్లెంతో సహా తాంబూలంతో కలిపి దానం చేస్తే అన్ని రకాల మోకాళ్ల నొప్పులు, ఎముకల సమస్యలు త్వరగా నయమవుతాయి.

ఇక శ్రావణమాసంలో శ్రీ మహా లక్ష్మీదేవికి పెరుగన్నం నైవేద్యంగా పెడితే ధనవృద్ధి జరుగుతుంది. శ్రావణ శుక్రవారం సాయంత్రం శ్రీ మహాలక్ష్మి పూజను చేసి పెరుగన్నాన్ని నైవేద్యంగా ఉంచి తాంబూలంతో పెరుగన్నాన్ని దానం చేస్తే మీ ఇంట్లో ధన వృద్ధి చేకూరుతుందని పురోహితులు అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu