Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహాశిల్పాల మహానగరం - మామల్లపురం

మహాశిల్పాల మహానగరం - మామల్లపురం

WD

ఈస్ట్‌కోస్ట్‌ రోడ్డు ద్వారా చెన్నె నుంచి పాండిచ్చేరి వెళ్లే దారిలో మహబలిపురంగా వ్వవహరింపబడే మామల్లపురం, అందమైన ఈ రహదారి ప్రక్కనే ఉంటూ ప్రత్యేక సోయగాలతో ఆహ్వానిస్తుంది. చెన్నెకు 53 కిలోమీటర్లు దూరంలో ఉన్న ఈ ప్రదేశం చరిత్రలో పల్లవుల కళా వైభవానికి ప్రతీకగా నిలిస్తుంది. క్రీ.శ. 6 శతాబ్ధంలో నిర్మితమైన లైటహ్ౌస్‌ ఇప్పటికీ ప్రధాన ఆకర్షణ గా నిలుస్తోంది. ప్రాచీన శిల్పకళా ప్రాభవంతో ద్రవిడ సంస్కృతి ప్రతిష్టను దశ దిశల వ్యాపించేసిందనడంలో సందేహం లేదు.

శిల శిల్పమైన వేళ : అజంతా గుహలలో శిల్పకళ నైపుణాన్నికి అబ్బురపడి పల్లవుల వంశానికి చెందిన మహేంద్రవర్మ, అటువంటి శిల్పకళ తన రాజ్యంలో కూడా ఉండాలనే ఆలోచనకు ఇచ్చిన రూపకల్పనే ఈనాటి ఈ మహాబలిపురం. శిల్పకారులు ఇక్కడ ఉన్న శిల్పాలను రూపొందించడానికి రేయింబవళ్ళు శ్రమించారన్న విషయం ఈ కళానైపుణ్యాన్ని సందర్శించిన ప్రతివారికి సులభంగా అర్దమౌవుతుంది. శిలను అందమైన శిల్పంగా మలచడానికి శిల్పకారులు ఉదయాన్నే శిలలను నూనెతో తడపడం, నూనెతో తడిపిన వస్త్రాలను కప్పడం చేసేవారు.

దీనివల్ల శిలలు వస్త్రాలలోని నూనెను పూర్తిగా పీల్చుకునేవి. కొంతకాలం తరువాత శిల్పకారుల మరలా వచ్చి ఆ రాళ్లుకు నిప్పు పెట్టి వేడి పుట్టించేవారు. ఇది అంతా రాళ్లకు మృదుత్వాన్ని ఇవ్వడానికి మాత్రమే. ఆ తర్వాత శిల్పాలు చెక్కడం ప్రారంభించేవారు. అలా ఎందరో శిల్పుల యొక్క కఠోరపరిశ్రమ, నైపుణ్యానికి ప్రతి రూపమే నేటి మహాబలిపురం. ఈ విధంగా మలచబడ్డ మహాబలిపురానికి మహేంద్ర వర్మ మల్లయుద్ద వీరుడైన తవ కుమారుడు నరసింహవర్మ (మల్లయుద్దంలో ఎందరినో జయించడం వల్ల అతనికి మహా మల్లు అనే బిరుదు వచ్చింది) మల్లు పేరుని తలపింపచేసే విధంగా ఈ ప్రాంతానికి మామల్లపురంగా నామకరణం చేసాడు.

చూడదగ్గ ప్రదేశాలు : మహాబలిపురంలో ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలు 4 ఉన్నాయి. అవి 1. సముద్రం ఒడ్డున ఉన్న ఆలయం 2. అర్జునుడు తపస్సు చేసిన ప్రదేశం 3. పంచ పాండవుల రధాలు 4. కృష్ణ మండపం.

Share this Story:

Follow Webdunia telugu