Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మధురానుభూతి మిగిల్చే మైసూర్‌

మధురానుభూతి మిగిల్చే మైసూర్‌

WD

కర్నాటకలో బెంగుళూరు తరువాత ముఖ్యమైనది మైసూరు. ఇది రాజప్రసాదాలకి, మహారాజుల కోటలకి, దేవాలయాలకి, నిలయమంటే అతిశయోక్తి లేదు. మైసూరు ఢిల్లీకి 2832 కి.మీ. దూరంలో ఉంది. బెంగుళూరు నుంచి మైసూర్‌కి 3 గంటల ప్రయాణం.

గంధపు చెక్కలకి, పట్టు చీరలకి మైసూర్‌ విశ్వవిఖ్యాతిగాంచింది. మైసూర్‌లో ఉన్న బృందావన్‌ గార్డెన్‌‌స ఆ నగరానికే వన్నె తెచ్చింది. ఇక్కడి రాజకోటలు, తోటలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. అక్టోబర్‌ ఈ నగరాన్ని సందర్శించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ జరిగే దసరా ఉత్సవాలు సందర్శకులను మరింత అలరిస్తాయి.

1912లో నిర్మించిన రాజమహల్‌ వాస్తుకళ నిజంగా ప్రశంసనీయం. ప్రస్తుతం మైసూర్‌ పాలెస్‌ని ఓ అద్భుతమైన మూ్యజియంగా మార్చారు. దీనిలో అమూల్యమైన విగ్రహాలు, చిత్రలు ఉన్నాయి. దీనిలోని దర్బార్‌హాల్లో 400 సం క్రితం తెచ్చిన 280 కి.గ్రాల వెండి సింహాసనం, హైదర్‌ అలీ, టిప్పు సుల్తాన్‌ల ఆయుధాలు కూడా దీనిలో ఉన్నాయి.

దీనితోపాటు జగన్‌మోహన్‌ ఆర్‌‌ట గాలరీ ఉంది. దీనిలో అత్యంత అద్భుతమైన చిత్రాలు, 15 అడుగుల అద్దం వుంది. ఈ రాజమహలులో 200 గదులు ఉన్నాయి. దర్బారు హాలుని సుమారు ఐదువేల మంది ఒకేసారి సందర్శించవచ్చు. ఈ రాజమహల్‌లో బంగారు సింహాసనం ఉంది. మూడు అంతస్తుల ఈ రాజమహల్‌ ఐదు కి.మీ.వరకు వ్యాపించి వుంది. సిటీబస్‌స్టాప్‌కి 23 కి.మీ.దూరంలో ఉన్న శృంగపటన్‌లో 19 అడుగుల ఎత్తు ఉన్న విష్ణుమూర్తి విగ్రహం ఉంది.

మైసూర్‌లో చూడదగిన దేవాలయాలలో చాముండీ మందిరం ఒకటి. దీని సింహద్వారం పొడవు 15 అడుగులు. అమ్మవారి విగ్రహం బంగారు ఆభరణాలతో అలంకరింపబడి ఐదడుగుల పొడవు వుంటుంది. మంగళవారం, శుక్రవారం జరిగే ప్రతే్యక పూజలకి 30 లక్షల భక్తులు వస్తారు.

కృష్ణవాడియర్‌ రాజు గుర్తుగా నిర్మించిన బృందావన్‌ గార్డెన్స్ సాయంత్రం 5 గం నుంచి రాత్రి 9 గం వరకు పర్యాటకులతో ఉన్న బృందావన్‌ గార్డెన్‌ ఎదురుగుండా కావేరీ దేవాలయం వుంది. ఇక్కడికి వచ్చిన పర్యాటకులకి మైసూర్‌ మరపురాని మధురానుభూతులని అందిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu