Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పేరుకే లక్షద్వీపాలు

పేరుకే లక్షద్వీపాలు

WD

కేరళలో సముద్రపు ఒడ్డు నుంచి సుమారు 200-300కి.మీ. దూరంలో ఉన్న లక్షద్వీప సమూహాలలో కేవలం 10 సమూహాలు నివాసయోగ్యంగా ఉన్నాయి. జనాభా మొత్తం 51,700వరకు ఉంది. అక్కడి వాతావరణం, వసతి సౌకర్యాలు, ప్రకృతి సౌందర్యం గురించి తెలుసుకుందాం.

అక్కడి వాతావరణం నివాసయోగ్యంగానే ఉంటుంది. వేసవికాలంలో గరిష్ట ఉష్ణోగ్రత 35డిగ్రీల స్సెలియస్‌, కనిష్ట ఉష్ణోగ్రత 25డిగ్రీల స్సెలియస్‌ ఉంటుంది. చలికాలంలో గరిష్ట ఉష్ణోగ్రత 32డిగ్రీల స్సెలియస్‌ నుంచి కనిష్ట ఉష్ణోగ్రత 20డిగ్రీల స్సెలియస్‌ వరకు నమోదవుతుంది. ఎన్‌.ఇ.పి.సి. ఎయిర్‌లైన్స్‌కి చైనా నుంచి అగాతీ ద్వీపం వరకు ఈ ప్రదేశాన్ని చేరుకోవడానికి విమాన సౌకర్యం ఉంది. అగాతీ నుంచి మిగిలిన ద్వీపాలను చేరుకోవడానికి హెలికాప్టర్స్‌ లభ్యమవుతాయి. అక్టోబర్‌ నుంచి ఏప్రిల్‌ మధ్యలో ఇక్కడికి నౌకయాన సౌకర్యం ఉంటుంది.

అన్ని ప్రముఖ, ద్వీపాలలో సముద్రపు ఒడ్డున టూరిస్ట్ హౌస్‌లు వుంటాయి. తద్వారా పర్యాటకులకు వసతి గృహ సౌకర్యాలు లభ్యమవుతాయి.

కొన్ని ముఖ్యద్వీపాలు :
కావారతీ : దీనిని ద్వీపసమూహాలకు రాజధానిగా పరిగణిస్తారు. ఇతర ద్వీపాలతో పోలిస్తే ఇది బాగా అభివృద్ధి చెందిన ద్వీపం. దీనిలో ముస్లిం మతస్తులు ఎక్కువగా వుండటం వలన ఇక్కడ మసీదులు ఎక్కువగా ఉంటాయి. వీటిలో ఉజరా మసీదు అన్నిటికంటే ప్రసిద్ధమైన మసీదు.

కలపెనీ : మూడు చిన్న చిన్న ద్వీపాల కలయికతో ఈ ద్వీపం ఏర్పడింది. ఆహ్లాదభరితమైన ప్రాకృతిక సౌందర్యం దీని సొంతం. జలక్రీడలకి కూడా ఇది పేరుగాంచింది.

కదమత్‌ : ఈ ద్వీపం వద్ద సముద్రపు లోతు తక్కువగా ఉండటం వలన ఈతగాళ్ళకి అనుకూలంగా ఉంటుంది.

మినికామ్‌ : లక్షద్వీపం నుంచి దూరంగా వుండటం వలన మాల్దీవుల నుంచి దీనిని చూడటానికి వీలుగా ఉంటుంది. ఇక్కడి లావా నృత్యం ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ బ్రిటిష్‌ వారు 1885లో న్మిరించిన లైటౌస్‌ని మనం ఇప్పటికీ చూడవచ్చు. ఇక్కడి ప్రజల జీవిత విధానంపై మాల్దీవుల సంస్కృతి ప్రభావం ఉంటుంది.

బంగారమ్‌ : ఇది అన్ని ద్వీపాలలోకి ప్రశాంతమైన ద్వీపం. ముఖ్యంగా ఏకాంతాన్ని ఆశించే ప్రేమికులకి అనువైన ప్రదేశం.

ఆగాతీ : ఇక్కడ విమానాశ్రయం ఉండటం వలన దీనిని మిగిలిన ద్వీపాలకి ప్రవేశద్వారంగా భావిస్తారు. సొసైటీ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ రిక్రియేషన్‌ టూరిజమ్‌ అండ్‌ స్పోర్ట్స్‌ ఈ ప్రదేశాలకి పర్యాటకుల సందర్శనకోసం తన సేవలను అందిస్తుంది. దీనికి సంబంధించిన కార్యాలయాలు కరావతీ, లక్షద్వీపం, హార్బర్‌రోడ్‌, విలింగ్‌డెన్‌ ఐలాండ్‌లలో వున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu