Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్లమ్ డాగ్ మిలియనీర్ చూడాలనుంది: ఒబామా

స్లమ్ డాగ్ మిలియనీర్ చూడాలనుంది: ఒబామా
అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రాన్ని చూడాలని ఉత్సాహపడుతున్నట్లు వైట్‌‌హౌస్ అధికార ప్రతినిధి రాబర్ట్ గిబ్స్ తెలిపారు. నిజానికి ఒబామా ఇటీవల కాలంలో ప్రపంచంలో విడుదలైన వివిధ భాషలకు సంబంధించిన పలు చిత్రాలు చూశారనీ, ఆ చిత్రాల జాబితాలో స్లమ్ డాగ్... కూడా ఉండే ఉంటుందని అనుకున్నానని గిబ్స్ తెలిపారు.

స్లమ్ డాగ్... ఏకంగా 8 ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకోవడం, ఏఆర్ రెహ్మాన్ అందించిన సంగీతం ఆబాలగోపాలాన్ని ఓలలాడించిన వైనం తెలుసుకున్న ఒబామా తప్పక చిత్రాన్ని చూసి తీరాల్సిందేనని తనతో చెప్పినట్లు గిబ్స్ పేర్కొన్నారు.

ముంబయి మహానగరంలోని మురికి వాడల్లో నివశించే ఓ పిల్లాడు, తన మేధా శక్తితో ఎలా కోటీశ్వరుడయ్యాడనే ఇతివృత్తంతో రూపొందించబడ్డ స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రం ఆస్కార్ అవార్డులతోపాటు అనేక ప్రత్యేక అవార్డులను సొంతం చేసుకుంది.

Share this Story:

Follow Webdunia telugu