Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

"హౌస్ ఆఫ్ కామన్స్‌"లో శిల్ప పెళ్లి వేడుకలు..?!

FILE
ప్రముఖ ఎన్నారై మిలీయనీర్ రాజ్‌కుంద్రాను వివాహం చేసుకున్న బాలీవుడ్ పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి.. తన పెళ్లి రిసెప్షన్‌ను "హౌస్ ఆఫ్ కామన్స్"లో ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు "ది మిర్రర్" పత్రిక ఓ కథనంలో వెల్లడించింది. సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం బ్రిటన్ పేరెన్నిగన్న "బిగ్ బ్రదర్" రియాలిటీ షోలో విజయం సాధించిన అనంతరం, ఆమె యూకేలోని సెలబ్రిటీల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

63 శాతం ఓట్లతో బిగ్ బ్రదర్ షోలో విజయం సాధించిన ఈ 34 ఏళ్ల బాలీవుడ్ భామ.. ఆ తర్వాత బ్రిటన్ రాణితో సమావేశం అయ్యారు. ఈ షో గెలుపుతో ఫెర్ఫ్యూమ్, యోగా సీడీ, రెస్టారెంట్లు ప్రారంభించిన శిల్ప, యూకేలో అనేకమైన వ్యాపారాల్లోకి అడుగుపెట్టారు.

అతి తక్కువ కాలంలో యూకేలో సెలబ్రిటీగా గుర్తింపు పొందిన శిల్ప.. తన వివాహ రిసెప్షన్‌ కోసం హౌస్ ఆఫ్ కామన్స్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఎంపీ కీత్‌వాజ్ ఈ వేడుకల నిర్వహణను చూస్తున్నట్లు సమాచారం. కాగా.. శిల్ప దంపతులు ఇప్పటికే భారత్‌లో రిసెప్షన్ ఇచ్చారనీ, బ్రిటన్ వేడుకల కోసం ఇప్పటికే పెద్ద మొత్తంలో నిధులు ఖర్చుచేశారని వారి వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే... యూకేలోని సర్రే ప్రాంతం వేబ్రిడ్జిలోని ఏడు బెడ్రూంలు కలిగిన విశాలమైన భవనంలో ఈ కొత్త జంట నివసిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu