Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"సీఈఓ ఆఫ్ ద ఇయర్"గా ఇంద్రా నూయీ

భారత సంతతికి చెందిన పెప్సికో సంస్థ ఛైర్మన్ మరియు సీఈఓ అయిన ఇంద్రానూయీ 2009 సంవత్సరానికిగానూ "సీఈఓ ఆఫ్ ద ఇయర్"గా ఎంపికయ్యారు. గ్లోబల్ సప్లై చైన్ లీడర్స్ గ్రూప్ (జీఎస్‌సీఎల్‌జి) సంస్థ నూయీని ఈ అవార్డుకు ఎంపిక చేసింది.

సామాజిక బాధ్యతగల వ్యాపార కార్యకలాపాలను నిర్వహించటమే గాకుండా, పర్యావరణ పరిరక్షణకు ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు జీఎస్‌సీఎల్‌జి ప్రకటించింది. తన ప్రతిభా సామర్థ్యాలతో నూయీ పెప్సికో సంస్థను అగ్రస్థానానికి తీసుకెళ్లారంటూ జీఎస్‌సీఎల్‌జి ఈ సందర్భంగా ప్రశంసల్లో ముంచెత్తింది.

అంకితభావంతో ప్రపంచ వాణిజ్య రంగంలో బహుముఖ వ్యూహాలను అమలుచేసి ఫలితాలు రాబట్టిన నూయీకి ఈ అవార్డు దక్కడం సబబుగానే భావిస్తున్నట్లు జీఎస్‌సీఎల్‌జి పేర్కొంది. ఇదిలా ఉంటే... తనకు దక్కిన ఈ అవార్డు నిర్విరామంగా పనిచేస్తున్న 1,98.000 మంది పెప్సికో కార్మికులందరికీ కూడా చెందుతుందని నూయీ వ్యాఖ్యానించారు. కాగా... కార్పొరేట్ రంగంలో విశేష ప్రతిభ కనబర్చిన వారిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తుంటారు.

Share this Story:

Follow Webdunia telugu