Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డల్లాస్ నగరాన్ని ఉర్రూతలూగించిన TANA ధిం-తాన

డల్లాస్ నగరాన్ని ఉర్రూతలూగించిన TANA ధిం-తాన
, మంగళవారం, 5 మే 2015 (14:30 IST)
డల్లాస్ నగరంలో తానా నిర్వహించిన “ ధింతాన”  వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డల్లాస్ తానా నాయకుడు శ్రీ రాజేష్ అడుసుమిల్లి చేసిన స్వాగతోపన్యాసంతో ఈ కార్యక్రమం మొదలైంది. అనంతరం దాదాపు 8 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా ప్రతిభావంతులు సంగీతం, నృత్యం, Ms. TANA, Mrs. TANA వంటి వివిధ విభాగాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

 
Folk Sub-Junior సంగీత  విభాగంలో సాయి తన్మయి ప్రధమ బహుమతి, Folk Junior విభాగంలో జూనియర్ విభాగంలో ప్రగ్య బ్రహ్మదేవర ప్రధమ బహుమతి, కృతి చంకుర & శ్రియ వసకర్ణ ద్వితీయ బహుమతి, వేద రామారావు తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. Folk/Film సీనియర్ విభాగంలో అఖిల్ ములుకుట్ల ప్రధమ బహుమతిని గెలుచుకున్నారు. అలాగే sub-junior classical విభాగంలో సాయి తన్మయి, junior classicalలో అభిరాం తాడేపల్లి ప్రధమ స్థానంలో, అశ్విన్ కుందేటి ద్వితీయ స్థానంలో, Senior విభాగంలో మైత్రేయి అబ్బూరి ప్రథమ స్థానంలో గెలుపొందారు.
webdunia

 
అలాగే సంస్కృతిక నృత్య విభాగంలో సంహిత బండారు&శ్రీరాగిని ఘంటసాల మొదటి స్థానంలో, సన్నిధి ఉదయగిరి & వ్రితిక ఇందూర్  ద్వితీయ స్థానాలను సొంతం చేసుకున్నారు. Senior నృత్య విభాగంలో సుమన్ వడ్లమాని, వైష్ణవి యలమరెడ్డి, శోభిత పోచిరాజు, సిల్పిత పోచిరాజు ప్రధమ స్థానంలో, యశస్వి పిండి & సంప్రీతి బింగి ద్వితీయ స్థానాలు గెలుపొందారు. అలాగే Junior విభాగంలో శ్రియ వస్కర్ల, ప్రితికశ్రీ తోటకూర, అవని, స్నిగ్ధ ఎలేస్వరపు, సోనిక పొద్దుటూరి, శ్రియ తెలకపల్లి విజేతలుగా నిలిచారు.

Sub-Junior విభాగంలో మానవి కొంగర, శబ్ద మోదుగు, రిషిక తోట, ఇషిత రత్నాకరం, సంవి గంగాధర, శ్రియ కాజా మరియు ధాత్రి తాడిమేటి విజేతలుగా నిలిచారు. అనంతరం జరిగిన Ms.TANA పోటీలలో నర్తన కలువగుంట ప్రథమం స్థానంలో, మినాలి నేమని ద్వితీయ స్థానంలో నిలిచారు. అలాగే &Mrs.TANA విభాగంలో పద్మశ్రీ తోట, వినీల కనకమేడల ప్రధమ ద్వితీయ విజేతలుగా నిలిచారు.
webdunia

 
ఈ పోటీలు విజయవంతంగా అవడానికి , జయ కళ్యాణి, శారద సింగిరెడ్డి, చంద్రహాస్ మద్దుకూరి, రఘురాం బుర్ర, శ్రీనివాస్ ఈయన్ని, ఐశ్వర్య రాజగోపాలన్, శిరీష ఈయన్ని, జస్మిత తుమ్మల, కృష్ణవేణి శీలం, లక్ష్మి పాలేటి, Dr సుధ కలవకుంట, క్రిటిక ముకుంద, రంజిత ఆర్య, అను శ్రిగిన, అను అడుసుమిల్లి, Dr మహేష్ గొంది, సంధ్య ఎదుగంటి అహర్నిశలు కృషి చేసారు.
webdunia

 
విజేతలందరికి TANA నిర్వాహకులు జ్ఞాపికాలు అందచేసారు. ఈ సందర్భంగా TANA మాజీ అధ్యక్షులు Dr. ప్రసాద్ తోటకూర, TANTEX  అధ్యక్షులు Dr. నరసింహా రెడ్డి ఉరిమింది, సుబ్బు జొన్నలగడ్డ, ఉమా ఎలమంచిలి, శ్రీకాంత్ పోలవరపు, పరమేష్ గేవినేని, LK గొర్రిపాటి, రవి మచ్చ, గీత బందరు, దీప్తి గొర్రెపాటి మరియు ఇతర ప్రముఖులు పాల్గొని విజేతలందరికి శుభాకాంక్షలు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu