Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విదేశీ విద్యార్థుల భద్రతకు చట్టంలో మరిన్ని మార్పులు: గిల్లార్డ్

విదేశీ విద్యార్థుల భద్రతకు చట్టంలో మరిన్ని మార్పులు: గిల్లార్డ్
FILE
తమ దేశంలో విద్యనభ్యసించేందుకు వచ్చే విదేశీ విద్యార్థుల భద్రత కోసం చట్టంలో మరిన్ని మార్పులు తీసుకురానున్నట్లు ఆస్ట్రేలియా ఉప ప్రధాని, విద్యాశాఖా మంత్రి జులియా గిల్లార్డ్ బుధవారం ప్రకటించారు. భారతీయులతో సహా విదేశీ విద్యార్థులందరికీ ప్రపంచ ప్రమాణాలతో కూడిన ఉత్తమమైన విద్యను అందించటంతోపాటు, కట్టుదిట్టమైన భద్రతను సైతం ఏర్పాటు చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.

మాజీ ఎంపీ బైర్డ్ రూపొందించిన "విదేశీ విద్యార్థులకు విద్యా సేవలు" అనే రివ్యూ రిపోర్టును విడుదల చేసిన గిల్లార్డ్ మాట్లాడుతూ.. విదేశీ విద్యార్థుల రక్షణ కోసం చట్టంలో సైతం మార్పులను తీసుకొచ్చే విషయమై ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు. రిపోర్టులో సూచించినట్లుగా విద్యా సేవలకు సంబంధించిన అంశాలలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే అమలు చేయనున్నట్లు తెలిపారు.

ఈ తాజా రిపోర్టు సూచించిన అంశాలకు ప్రభుత్వం కూడా ఆమోదముద్ర వేసిందని ఈ సందర్భంగా జులియా గిల్లార్డ్ తెలియజేశారు. విద్యార్థులకు సంబంధించి అభివృద్ధి చేయాల్సిన కార్యక్రమాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయటమేగాకుండా, ఉత్తమమైన విలువలను పాటించని విద్యార్థులను సైతం ఏరి పారేయాల్సిందిగా ప్రభుత్వం సూచించిందన్నారు. తమ దేశం అంతర్జాతీయ విద్యార్థులకు ఎల్లప్పుడూ సురక్షితమైనదేననీ, గత కొంతకాలంగా జరుగుతున్న అంశాలను పట్టించుకోకుండా భయాలన్నింటినీ పారద్రోలి ఇక్కడికి వచ్చి విద్యనభ్యసించాలని గిల్లార్డ్ ఈ మేరకు విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.

Share this Story:

Follow Webdunia telugu