Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మలేషియా వారసత్వ ప్రాంతంలోని ఆలయాలపై కలాం ప్రశంసలు

మలేషియా వారసత్వ ప్రాంతంలోని ఆలయాలపై కలాం ప్రశంసలు
జార్జిటౌన్ , సోమవారం, 1 సెప్టెంబరు 2008 (11:08 IST)
మలేషియాలోని జార్జిటౌన్‌, మలక్కా వంటి నగరాల్లో నిర్మించిన వివిధ మతాలకు చెందిన ఆలయాలను చూసి భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రశంసించారు. విభిన్న జాతుల వారు కలిసి జీవించేందుకు ఆ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.

జార్జిటౌన్‌లోని పెనాంగ్‌లో ఖజానహ్ నేషనల్ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు కలాం మలేషియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని పలు వారసత్వ కట్టడాలను సందర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, సెయింట్ జార్జి చర్చ్, అచీన్ స్ట్రీట్ మసీదులు, నాగోర్ దేవాలయం, పెనాంగ్ ఇస్లామ్ మ్యూజియం, పట్టణంలోని బ్రహ్మాండమైన కట్టడాలని ఆయన ప్రశంసించారు.






Share this Story:

Follow Webdunia telugu