Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎన్ఏటీఎస్‌లో "గజల్" శ్రీనివాస్ గానామృతం!!

ఎన్ఏటీఎస్‌లో
WD
WD
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (ఎన్ఏటీఎస్) ఈనెల 12వ తేదీన న్యూజెర్సీ, ఎడిసన్‌లోని మ్యారేజ్ బాంక్వెట్ హాలులో నిర్వహించిన ఒక కార్యక్రంలో ట్రిపుల్ గిన్నిస్ వరల్డ్ రికార్డు హోల్డర్ గజల్ శ్రీనివాస్ గానామృతం ఎంతగానో ఆలరించింది. నిధుల సేకరణ నిమిత్తం ఎన్.ఏ.టి.ఎస్ ఈ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో తెలుగు సంబరాలు, ఉత్తర అమెరికా తెలుగు సంఘం సామాజిక సేవా అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక తెలుగు ప్రజలు అనేక మంది పాల్గొన్నారు. తద్వారా సుమారు రెండు కోట్ల రూపాయల మేరకు నిధులు వసూలయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ "గజల్" గాయకుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ ఆలపించిన తెలుగు గజల్స్ ప్రవాసాంధ్ర ప్రజలను ఎంతగానో ఆలరిస్తూ మంత్రముగ్ధులను చేశాయి. గజల్స్ ఆలాపనతో పాటు శ్రీనివాస్ ఇచ్చిన సందేశం ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది.

ఈ కార్యక్రమంలో ప్రముఖులు డాక్టర్ సూర్య గంటి, శ్రీమతి అరుణ, డాక్టర్ ప్రేమ్ నందివాడ, డాక్టర్ లక్ష్మీపతి గరిపల్లి, అప్పలనేని రాజేంద్ర, అనిత, విజయ్ వాసిరెడ్డి, లతా వాసిరెడ్డి, డాక్టర్ బండారు పరశురామి రెడ్డి, డాక్టర్
webdunia
WD
WD
బొమ్మిరెడ్డి రామ్మోహన్ రెడ్డి, జొన్నలగడ్డ పాండురంగారావు, రమాదేవి, రవి హజీబ్, డాక్టర్ జీఆర్‌ఎమ్ ప్రసాద్, క్రిష్ణ గంట, హరి తుమ్మల, రాజశేఖర్ చిర్రా, మహేంద్ర ముసుకు, గున్నకొండ రవీందర్ రెడ్డి, రమణశ్రీ, అట్లూరి జితేంద్ర, మోహన్ పొత్తల, చెరుకూరి రమా కృష్ణలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


ఈ కార్యక్రమంలో స్వాగత గీతాన్నిశిరశ్రీ రాయగా, సతీష్ కెంబూర్ వీడియో కంపోజ్ చేశారు. నంది అవార్డు గ్రహీత ప్రముఖ గాయకురాలు శ్రీమతి ఉషా అమెరికన్ తెలుగు గాయకుడు గరికపాటి శ్రీరామ్‌తో కలిసి తెలుగు సినిమాల్లోని మెలోడి పాటలను పాడి ఆహుతులను ఎంతగానో ఆలరించారు.

సంఘం అధ్యక్షుడు రవి మాదాల, డైరక్టర్స్ మధు కొర్రపాటి, దేశు గంగాధర్, రాజ్ అల్లడ, అనీల్ బొప్పూడి, డాక్టర్ బాడిగ శ్రీరామచంద్ర మూర్తి, డాక్టర్ బుచ్చయ్య కొంద్రగుంట, విజయ్ అన్నపరెడ్డి, మోహన్ కృష్ణ మన్నవ, శ్రీనివాస్ మద్దాలి, విమల్ కావూరి, శ్రీధర్ అప్పసాని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.

Share this Story:

Follow Webdunia telugu