Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆనంద్ జాన్‌‌కు మరో కోర్టు విచారణ

ఆనంద్ జాన్‌‌కు మరో కోర్టు విచారణ
లైంగిక వేధింపుల కేసులలో దోషిగా నిర్ధారణ అయిన భారత సంతతికి చెందిన ఫ్యాషన్ డిజైనర్ ఆనంద్ జాన్ (35).. ఇదే ఆరోపణలపై న్యూయార్క్ కోర్టు విచారణను కూడా ఎదుర్కోనున్నాడు. లైంగిక వేధింపుల కేసులో కాలిఫోర్నియా న్యాయస్థానం ఇతగాడికి శిక్ష ఖరారు చేసిన తరువాత, ఆగస్టు నెలలో న్యూయార్క్ కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని సంబంధిత అధికారులు ఉటంకించినట్లుగా "న్యూయార్క్ పోస్ట్" పత్రిక ఒక కథనాన్ని వెల్లడించింది. కాగా... ఆనంద్ జాన్‌పై రెండు రకాల అభియోగాలు నమోదవగా.. టెక్సాస్, మస్సాచుసెట్స్ ప్రాంతాల నుంచి ఎక్కువగా కేసులు మోపబడ్డాయి. 12 మంది బాలికలు, ఒక మహిళపై ఇతను దాడికి పాల్పడ్డాడని అభియోగాలు మోపబడడ్డాయి.

అయితే.. జాన్ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కాలిఫోర్నియా కోర్టు... ఔత్సాహిక మోడల్స్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చింది. దోషిగా తేల్చిన న్యాయస్థానం జాన్‌కు రాబోయే ఆగస్టు నెలలో శిక్షను ఖరారు చేయనుంది. ఆ తరువాత న్యూయార్క్ న్యాయస్థానం కూడా ఇతగాడిని విచారించనున్నట్లు న్యూయార్క్ పోస్ట్ కథనం ద్వారా తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu