Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత ఖైదీలకు యూఏఈ చిత్రహింసలు: అమ్నెస్టీ ఆందోళన

భారత ఖైదీలకు యూఏఈ చిత్రహింసలు: అమ్నెస్టీ ఆందోళన
FILE
మరణశిక్ష పడ్డ 17 మంది భారతీయులను యునైటెడ్ ఆరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) చిత్రహింసలకు గురి చేస్తోందని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. నేరాన్ని ఒప్పుకోమంటూ భారతీయులను బలవంతం చేస్తున్న యూఏఈ అధికారులు, అందుకు భారతీయులు ఒప్పుకోకపోవటంతో టార్చర్ చేస్తోందని అమ్నెస్టీ ఆరోపించింది.

కాగా.. ఓ పాకిస్తాన్ పౌరుడిని హత్యతోపాటు, మరో ముగ్గురు పాకిస్థాన్ జాతీయులను గాయపరిచారన్న నేరారోపణలతో 17 మంది భారతీయులకు యూఏఈ గత నెలలో మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే మరణశిక్షకు వ్యతిరేకంగా అప్పీలు చేసుకునే అవకాశాన్ని భారతీయులకు కల్పించింది. అదలా ఉంటే.. ఈ కేసుపై అప్పీల్ చేసుకున్న భారతీయులకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

బీబీసీ కథనం ప్రకారం.. హత్య కేసులో నిందితులుగా పట్టుబడ్డ 17 మంది భారతీయులను యూఏఈ పోలీసు అధికారి ఒకరు నేరం ఒప్పుకోమంటూ కొట్టారనీ.. అందుకు తగిన సరైన సాక్ష్యాధారాలు తమవద్ద ఉన్నాయని అమ్నెస్టీ వెల్లడించినట్లు తెలుస్తోంది. 17 మంది భారతీయులను యూఏఈ పోలీసుల అధికారి కొట్టిన విషయానికి సంబంధించిన ఆధారాలను ఇండియన్ రైట్స్ గ్రూప్ న్యాయవాదులు హ్యూమన్ రైట్స్ ఇంటర్నేషనల్ (ఎల్ఎఫ్‌హెచ్ఆర్ఐ)కు అందజేసినట్లు అమ్నెస్టీ పేర్కొంది.

17 మంది భారతీయును తీవ్రంగా కొట్టడమే గాకుండా, కరెంట్ షాక్‌లకు గురిచేయటం, రాత్రంతా నిద్రపోనీయకుండా చేయటం, ఒంటికాలిపై నిలబెట్టడం లాంటి చిత్రహింసలకు గురిచేసినట్లుగా.. న్యాయవాదులు హ్యూమన్స్ రైట్స్ ఇంటర్నేషనల్‌కు సమర్పించిన సాక్ష్యాధారాలలో వివరించినట్లు అమ్నెస్టీ తెలిపింది.

ఈ సందర్భంగా మిడిల్ ఈస్ట్ మరియు నార్త్ ఆఫ్రికా అమ్నెస్టీ డిప్యూటీ డైరెక్టర్ హస్సిబ హద్జ్ షారావుయ్ మాట్లాడుతూ.. భారతీయులను చిత్రహింసలకు గురిచేయటం అనేది న్యాయశాస్త్రాన్ని అవహేళన చేయటమేనని ఆరోపించారు. అదే విధంగా ఓ మోసపూరిత వీడియో ఆధారంగా బాధితులను నేరం ఒప్పుకోమంటూ బలవంతం చేయటం అనేవి క్షమార్హం కావని అన్నారు. ఈ ఘటనపై యూఏఈ అధికారులు ఇప్పటికైనా మేల్కొని.. చిత్రహింసలకు గురిచేసిన అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu