Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ద్వంద్వ పౌరసత్వంపై హెచ్ఎస్‌ఎమ్‌పీ బహిరంగ లేఖ

ద్వంద్వ పౌరసత్వంపై హెచ్ఎస్‌ఎమ్‌పీ బహిరంగ లేఖ
FILE
ప్రవాస భారతీయులకు ద్వంద్వ పౌరసత్వం కల్పించాలంటూ.. "హెచ్‌ఎస్‌ఎమ్‌పీ" భారత ప్రధాని మన్మోహన్ సింగ్‌కు ఓ బహిరంగ లేఖను రాసింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో భారతీయులకు ద్వంద్వ పౌరసత్వం కల్పించటం ద్వారా మాతృదేశంతో సంబంధాలు కొనసాగించేలా చూడాలని బ్రిటన్‌లోని పలు వలస జాతులకు ప్రాతినిధ్యం వహిస్తున్న అత్యంత ప్రతిభ కలిగిన వలస వృత్తి నిపుణుల సంఘం (హెచ్‌ఎస్‌ఎమ్‌పీ) ఈ లేఖలో ప్రధానికి విజ్ఞప్తి చేసింది.

ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా ప్రధాని మన్మోహన్ ఇచ్చిన హామీని వీలైనంత త్వరగా అమలు చేయాలని పై లేఖలో హెచ్‌ఎస్‌ఎమ్‌పీ అధ్యక్షుడు అమిత్ కపాడియా కోరారు. కాగా.. 2010 జనవరిలో జరిగిన ప్రవాసీ భారతీయ దివస్‌లో పాల్గొన్న ప్రధాని మాట్లాడుతూ.. వచ్చే సార్వత్రిక ఎన్నికలలోపు ఎన్నారైలకు ద్వంద్వ పౌరసత్వం కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ప్రధానికి ఈ విషయాన్ని గుర్తు చేస్తూ బహిరంగ లేఖ రాసిన ప్రవాస భారతీయులు.. కొత్త తరానికి తమ దేశం గురించి తెలుసుకునేందుకు ద్వంద్వ పౌరసత్వం దోహదపడుతుందన్నారు. అలాగే భారతదేశ ఆదర్శాలను ప్రపంచమంతా చాటి చెప్పేందుకు ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. పలు ప్రజాస్వామ్య దేశాలు తమ పౌరులకు ద్వంద్వ పౌరసత్వాన్ని ఇస్తున్న విధంగా భారతీయులకు కూడా ఇవ్వాలని వారు ఆ లేఖలో కోరారు.

Share this Story:

Follow Webdunia telugu