Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుగుముఖం పట్టిన ఎస్.ఎం. కృష్ణ

తిరుగుముఖం పట్టిన ఎస్.ఎం. కృష్ణ
FILE
ఆస్ట్రేలియాలో తన ఐదు రోజుల పర్యటనను ముగించుకున్న భారత విదేశాంగ శాఖా మంత్రి ఎస్.ఎం.కృష్ణ సోమవారం స్వదేశానికి తిరుగుముఖం పట్టారు. ఈ మేరకు, భారత విద్యార్థులపై జరుగుతున్న జాత్యహంకార దాడుల గురించి ఆ దేశ అధికార యంత్రాంగాన్ని కలుసుకున్న ఆయన... విద్యార్థుల రక్షణకై తీసుకుంటున్న చర్యల గురించి తీవ్రంగా చర్చించారు.

తన పర్యటనలో భాగంగానే... ఫసిఫిక్ ఐలాండ్ ఫోరం సదస్సు (పిఐఎఫ్)లో కూడా పాల్గొన్న ఎస్.ఎం. కృష్ణ... ఆస్ట్రేలియా ప్రధాని కెవిన్ రూడ్ మరియు ఆదేశ విదేశాంగ మంత్రి స్టీఫెన్ స్మిత్‌తో కూడా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన భారత విద్యార్థుల రక్షణ చర్యల గురించి ప్రస్తావించగా, కెవిన్ రూడ్ గట్టి హామీనిచ్చారు.

క్వీన్స్‌ల్యాండ్‌లో 20 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీలో భారత విద్యార్థుల భద్రతకు సంబంధించి, జాత్యహంకార దాడులను అరికట్టే అంశం గురించి కృష్ణ మాట్లాడారు. సమావేశం అనంతరం కృష్ణ విలేకర్లతో మాట్లాడుతూ... భారత విద్యార్థుల భద్రతకు సంబంధించి గట్టి చర్యలు తీసుకుంటామని కెవిన్ రూడ్ హామీనిచ్చినట్లు చెప్పారు. కాగా.. ఈ సమావేశం సంతృప్తిగా ముగిసిందని ఆయన తెలిపారు.

ఆ తరువాత భారతీయ విద్యార్థులను స్వయంగా కలుసుకున్న కృష్ణ... వారి సమస్యలను అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. అంతేగాకుండా, మూడు నెలల క్రితం దుండగుల దాడిలో గాయపడిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థి శ్రావణ్ కుమార్‌ను కలిసిన ఆయన... ధైర్యం చెప్పటమేగాక, లక్షరూపాయల వ్యక్తిగత సాయాన్ని కూడా అందజేశారు.

Share this Story:

Follow Webdunia telugu