Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చికాగోలో స్వాతంత్ర్యోత్సవ సంబరాలు

చికాగోలో స్వాతంత్ర్యోత్సవ సంబరాలు
FILE
భారత 62వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చికాగోలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను చికాగోలోని ప్రవాస భారతీయులందరూ వారం రోజులపాటు జరుపుకుంటారు. భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, జాతీయ గీతాలాపనతో ప్రారంభమైన ఈ వేడుకల్లో చికాగో మేయర్ సందేశాన్ని ప్రజా సంబంధాల కమీషన్ డైరెక్టర్ క్రిపాల్ జాలా చదివి వినిపించారు.

ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ నిర్వహించిన ఈ సంబరాలలో... భారతీయుల సాంగత్యంతో తాము వ్యాపార, వైద్య రంగాలలోనే కాకుండా అనేక రంగాలలో అభివృద్ధి సాధించామంటూ చికాగో నగర మేయర్ రిచర్డ్ డాలే పంపించిన సందేశాన్ని అందరిముందూ చదివి వినిపించారు.

ఈ సందర్భంగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ అధ్యక్షుడు హైదర్ మహ్మద్ మాట్లాడుతూ... ఇలాంటి కార్యక్రమాల వల్ల ఇరు దేశాల సంబంధాలు మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇండో అమెరికన్ యువత.. పంజాబీ, బాలీవుడ్ సంగీతానికి అనుగుణంగా డ్యాన్స్‌లు వేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu