Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంకా భర్తీకాని హెచ్‌1బీ వీసాలు.. తగ్గిన ఆదరణ..!

ఇంకా భర్తీకాని హెచ్‌1బీ వీసాలు.. తగ్గిన ఆదరణ..!
FILE
భారతీయుల్లో అత్యంత క్రేజ్ కలిగిన అమెరికా హెచ్1బీ వీసాలకు ఆదరణ కరువయ్యింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగియవస్తున్నా నిర్దేశిత సంఖ్యకు 20 వేలకు తక్కువగా దరఖాస్తులు రావటం దీనికి ప్రత్యక్ష నిదర్శనం. మరో నెల రోజుల్లో నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాబోతున్నా, ఇంకా వేల సంఖ్యలో వీసాలు మిగిలిపోవటంతో ఆ దేశ వలసల విభాగం ఆందోళనలో పడిపోయింది.

ఆర్థిక సంక్షోభం కారణంగా నిరుద్యోగం 26 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరటంతో అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎ‌స్‌సీఐఎస్) వీసా నిబంధనలను కఠినతరం చేసింది. అలాగే, మాంద్యం ప్రభావంతో విదేశీ వృత్తి నిపుణులకు ఇచ్చే హెచ్1బీ వీసాల సంఖ్యను అమెరికా 65 వేలకు కుదించిన సంగతి తెలిసిందే.

ఈ సంవత్సరం ఆగస్టు 28 నాటికి దాదాపు 45 వేల దరఖాస్తులు వచ్చాయని యూఎస్‌సీఐఎస్ అధికార వర్గాలు ప్రకటించాయి. అయితే తాము నిర్దేశించిన కోటా భర్తీ చేసేందుకు ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేంతదాకా దరఖాస్తుల స్వీకరణను కొనసాగించే ప్రక్రియను చేపడతామని యూఎస్‌సీఐఎస్ వెల్లడించడం గమనార్హం. కాగా.. వలసల శాఖ రూపొందించిన కఠిన నిబంధన కారణంగానే వీసాలు భర్తీ కావటం లేదని సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu