Article Non Vegetarian %e0%b0%ae%e0%b1%80%e0%b0%a8%e0%b1%8d %e0%b0%95%e0%b1%81%e0%b0%b0%e0%b1%8d%e0%b0%ae%e0%b0%be 108091100086_1.htm

మీన్ కుర్మా

Advertiesment
వంటకాలు మాంసాహారం శుభ్రం చేపముక్కలు వెల్లుల్లి కారం అల్లం మసాలా మిశ్రమం లవంగాలు యాలకులు నూనె కొత్తిమీర మీన్ కుర్మా
FileND
కావలసిన పదార్థాలు :
చేపలు... అరకిలో
వెల్లుల్లి... అయిదు రెబ్బలు
లవంగాలు... ఐదు
యాలకులు... మూడు
ధనియాలు... ఒకస్పూన్
దాసినచెక్క... రెండు ముక్కలు
నూనె... రెండు స్పూన్లు
కొత్తిమీర... ఒక కట్ట
కారం... రెండు స్పూన్లు
ఉల్లిపాయలు... రెండు
పెరుగు...ఒక కప్పు
పసుపు...చిటికెడు
పచ్చిమిరపకాయలు... మూడు
ఉప్పు... తగినంత

తయారీ విధానం :
ముందుగా శుభ్రం చేసుకున్న చేప ముక్కలకు వెల్లుల్లి, కారం, అల్లం నూరిన మసాలా మిశ్రమాన్ని బాగా పట్టించాలి. ఆ ముక్కలపై కప్పు పెరుగును కుమ్మరించి మూతపెట్టాలి. బాణలిలో నూనె పోసి బాగా వేడయ్యాక పెరుగులో ఉంచిన చేపముక్కల్ని అందులో వేయాలి.

అయిదు నిముషాల తర్వాత మసాలాగా నూరిన పచ్చిమిర్చి, కొత్తిమీర, ధనియాలు, వెల్లుల్లిల మిశ్రమాన్ని అందులో కలుపుకోవాలి. కాసిన్ని నీళ్లు పోసి చేపముక్కలు ఉడికేదాకా ఉంచాలి. కూర మొత్తం కుర్మాలాగా చిక్కబడి కమ్మటి వాసన వస్తుండగా కొత్తిమీర చల్లి దింపుకోవాలి. అంతే మీన్ కుర్మా రెడీ అయినట్లే...!

Share this Story:

Follow Webdunia telugu