చిల్లీ ఎగ్స్ టేస్ట్ చేసి చూడండిలా..!!
, శనివారం, 7 ఏప్రియల్ 2012 (17:02 IST)
కావలసిన పదార్థాలు :కోడిగుడ్లు -4(ఉడికించినవి),పండు మిరపకాయల పేస్ట్ - టీ స్పూన్,పచ్చిమిరపకాయల పేస్ట్- టీస్పూన్,అల్లం - చిన్న ముక్క,వెల్లుల్లి -2,చింతపండు గుజ్జు - 2 టేబుల్స్పూన్లు,ఉప్పు - తగినంత,ఉల్లిపాయ తరుగు - టేబుల్ స్పూన్,వంటసోడా - చిటికెడు,సోయా సాస్- టీస్పూన్,నూనె- తగినంతతయారు చేసే విధానం:బాణలిలో నూనె పోసి వేడయ్యాక గుడ్లు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించి, తీసి పక్కన పెట్టికోవాలి. విడిగా మరో పాన్లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అల్లం, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు వేసి నిమిషం పాటు వేయించాలి. దానితో పాటప సోయా సాస్, చింతపండు గుజ్జు, ఉప్పు వేసి ఉడికించాలి.ఆ మిశ్రమంలో వేయించిన గుడ్లకు సాస్ పూసి వేయాలి. చైనీస్ రైస్, రోటీ లేదా పరోఠాలోకి ఈ చిల్లీ ఎగ్ కాంబినేషన్ రుచిగా ఉంటుంది. గుడ్డు ఇష్టపడనివాళ్లు దీనికి బదులుగా బంగాళదుంపలు వాడి చిల్లీ పొటాటో చేసుకోవచ్చు. ఎంతో రుచికరమైన చిల్లీ ఎగ్స్ టేస్ట్ చేసి చూడండి.