Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అమీర్ ఖాన్ అసహనం కామెంట్స్.. స్నాప్ డీల్ రద్దు వెనుక బీజేపీ హస్తం ఉంది: స్వాతి చతుర్వేది

బాలీవుడ్ స్టార్, దంగల్ స్టార్ అమీర్ ఖాన్‌ను బీజేపీ టార్గెట్ చేసిందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. దేశంలో పరమత అసహనం పెరిగిపోతోందంటూ అమీర్ చేసిన వ్యాఖ్యలకుగాను ఈ-కామర్స్ సైట్ 'స్నాప్‌డీల్' అతనితో తమ క

అమీర్ ఖాన్ అసహనం కామెంట్స్.. స్నాప్ డీల్ రద్దు వెనుక బీజేపీ హస్తం ఉంది: స్వాతి చతుర్వేది
, గురువారం, 29 డిశెంబరు 2016 (09:00 IST)
బాలీవుడ్ స్టార్, దంగల్ స్టార్ అమీర్ ఖాన్‌ను బీజేపీ టార్గెట్ చేసిందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. దేశంలో పరమత అసహనం పెరిగిపోతోందంటూ అమీర్ చేసిన వ్యాఖ్యలకుగాను ఈ-కామర్స్ సైట్ 'స్నాప్‌డీల్' అతనితో తమ కాంట్రాక్టును రద్దు చేయడం వెనుక ఏం జరిగిందో స్వాతి చతుర్వేది అనే జర్నలిస్టు తన పుస్తకం ఐయాంఎ ట్రాల్‌లో పేర్కొంది. దీంతో అమీర్ ఖాన్‌ను బీజేపీ టార్గెట్ చేసిందని ఆయన్ని దెబ్బతీయాలని భావించిందని స్వాతి చతుర్వేది వార్తలను బట్టి తెలుస్తోంది. 
 
బీజేపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం.. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసిన ఫలితంగానే స్నాప్‌డీల్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా ఆమిర్ కాంట్రాక్టును రద్దు చేసుకుందని స్వాతి చతుర్వేది తెలిపింది. ఇంకా ఆ కాంట్రాక్టును స్నాప్‌డీల్ పొడిగించకపోవడం గమనార్హం. దేశంలో పరమత అసహనం పెరిగిపోవడం దారుణమని 2015లో రామనాథ్ గోయెంకా అవార్డుల ఫంక్షన్‌లో అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సెన్సేషనల్‌కు దారి తీసిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలోనే స్నాప్ డీల్ అమీర్ ఖాన్‌తో తన డీల్‌ను రద్దు చేసుకుంది. బీజేపీ సోషల్ మీడియా టీమ్‌లోని మాజీ సభ్యురాలు సాధ్వి ఖోస్లా తనకీ విషయాన్ని తెలియజేసినట్టు స్వాతి పేర్కొంది. మొత్తం ఈ తతంగం వెనుక ఈ విభాగం కన్వీనర్ అరవింద్ గుప్తా హస్తం ఉందని.. కావాలంటే తన వద్ద వాట్సాప్ మెసేజ్‌లు ఉన్నాయని తెలిపింది. 
 
ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి ప్రచారానికి పాల్పడాల్సిన కర్మ అధికార పార్టీకి ఎందుకుండాల్సి వచ్చిందని స్వాతి ప్రశ్నించింది. ఓ చిన్న వ్యతిరేక వ్యాఖ్యనైనా ప్రధాని మోడీ ఎందుకు సహించలేకపోతున్నారని కూడా ఆమె దుయ్యబట్టింది. ఒక జర్నలిస్టుగా తనను ఈ పోకడ కలవరానికి గురి చేసిందని ఆమె విచారం వ్యక్తం చేసింది.
 
అయితే అరవింద్ గుప్తా ఈ ఆరోపణలను తోసిపుచ్చాడు. ఈ కుట్రకు తాము పాల్పడలేదని, సాధ్వి ఖోస్లాకు కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించాడు. ఈ విషయం తెలిసిన స్వాతి చతుర్వేది ఈ నిందను ఖండిస్తూ.. ఖోస్లాకు ఏ పార్టీతోనూ లింకులేదని, పంజాబ్‌లో డ్రగ్స్ మాఫియాపై ఓ డాక్యుమెంటరీ తీసిన ఖోస్లా ఇలా ఓ నిజాన్ని బయటపెడితే దానికి పొలిటికల్ టచ్ ఇస్తారా అంటూ ఆమె ఫైర్ అయ్యింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎంపీ భర్త అని కూడా చూడలేదు.. శశికళ భర్తను చితక్కొట్టిన అన్నాడీఎంకే కార్యకర్తలు!