Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అశ్లీల మెయిల్స్ పంపి వేధించిన వ్యక్తికి జైలు

అశ్లీల మెయిల్స్ పంపి వేధించిన వ్యక్తికి జైలు
, శనివారం, 4 జులై 2015 (11:52 IST)
యువతిని మెయిళ్ళలో వెంబడించి అశ్లీల మెయిళ్లను పంపి వేధించిన కృత్యానికి ఓ యువకుడికి జైలు శిక్ష పడింది. 2009లో యోగేష్ ప్రభు అనే యువకుడు సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఆర్క్యుట్ ద్వారా ఓ యువతితో స్నేహం చేశాడు. కాగా యోగేష్ ప్రవర్తన నచ్చకపోవడంతో ఆమె తన స్నేహితుల జాబితా నుంచి అతని పేరు తొలగించింది. 
 
అయితే యోగేష్ అశ్లీలమైన ఫొటోలను, మెయిల్స్ను ఆమెకు పంపేవాడు. మొదట్లో ఆమె క్షమించినా యోగేష్ ప్రవర్తన మారకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ముంబై సైబర్ సెల్ పోలీసులు దర్యాప్తు చేసి యోగేష్పై కేసు నమోదు చేశారు. నిందితుడికి మూడు నెలల జైలు శిక్షతో పాటు 5 వేల రూపాయల జరిమానా విధిస్తూ ముంబై మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ తీర్పు చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu