Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస్తి కోసం సొంత వదినను మట్టుబెట్టారు.. చర్చలకంటూ వచ్చి ఉరేసి చంపేశారు..!

ఆస్తి కోసం సొంత వదిననే ముగ్గురు మరుదులు అత్యంత కిరాతకంగా ఉరేసి హత్య చేసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. స్వార్థం కోసం మానవ సంబంధాలు మంటగలుస్తున్న నేపథ్యంలో.. వదినను ఆస్తి కోసం హతమార్చిన ఘటన బెంగళూరు మ

ఆస్తి కోసం సొంత వదినను మట్టుబెట్టారు.. చర్చలకంటూ వచ్చి ఉరేసి చంపేశారు..!
, బుధవారం, 31 ఆగస్టు 2016 (11:26 IST)
ఆస్తి కోసం సొంత వదిననే ముగ్గురు మరుదులు అత్యంత కిరాతకంగా ఉరేసి హత్య చేసిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. స్వార్థం కోసం మానవ సంబంధాలు మంటగలుస్తున్న నేపథ్యంలో.. వదినను ఆస్తి కోసం హతమార్చిన ఘటన బెంగళూరు మండ్య గ్రామీణ పోలీస్‌ స్టేషన్ పరిధిలోని లాళనకెరె గ్రామంలో సంభవించింది.
 
వివరాల్లోకి వెళితే... మండ్య గ్రామానికి చెందిన గౌరమ్మ (48)ను వీరరాజ్‌పురకు చెందిన గౌరమ్మను లాళనకెరెకు చెందిన శివనంజప్పకు ఇచ్చి వివాహం చేశారు. అనంతరం శివనంజప్ప మృతి చెందడంతో ఆస్తిపాస్తులన్నీ గౌరమ్మకు వెళ్లాయి. కొద్దికాలంగా తమ సోదరుడు శివనంజప్ప భూములపై హక్కుల కోసం మిగిలిన ముగ్గురు సోదరులు ఘర్షణకు దిగేవారు. 
 
సోమవారం రాత్రి గౌరమ్మ ఇంట్లో ఒంటరిగా ఉందన్న సంగతి తెలుసుకున్న మరదులు చర్చించాలంటూ వచ్చారు. వీరి కుట్ర సంగతి తెలియని ఆమె ఇంట్లో కూర్చోబెట్టింది. అంతే ఇంట్లోకి వస్తూనే సొంత మరదులు శివప్ప (42), శంకరప్ప (48), మహదేవప్ప (52)లు ఉరివేసి ఆమెను దారుణంగా హతమార్చారు. నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిలకడగా జయేంద్ర సరస్వతి ఆరోగ్యం : డాక్టర్‌ రవిరాజ్‌