Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కిలాడీ లేడీ..! ఆమె వలలో పడ్డారో.. బతుకు బ్లూ ఫిలిమే..!!

కిలాడీ లేడీ..! ఆమె వలలో పడ్డారో..  బతుకు బ్లూ ఫిలిమే..!!
, శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (07:26 IST)
అమ్మాయి నగ్నచిత్రాలను, లేదా విడియోలను తీసి బ్లాక్ మెయిల్ చేసే కేటుగాళ్లను చూశాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్... రిచ్ పర్సనాలిటీలను తన అందంతో టచ్ లోకి తీసుకుని వారి నగ్న, అశ్లీల చేష్టలను కెమెరాలో బంధించే ఓ కిలాడీ లేడీ ఉదంతం బయటపడింది. ఆపై బ్లాక్ మెయిల్ చేసి లక్షలకు లక్షలు గుంజేస్తుంది. ఉదయపూర్ లో కిలాడీ లేడీ బారిన పడి లబోదిబో మంటున్న మగాళ్లు ఎందరో... వివరాలు 
 
రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్పూర్లోని వర్మ కాలనీ ప్రాంతానికి చెందిన రుబినా హరూన్ ఖాన్ (28) అనే మహిళ ఆటోమొబైల్ ఏజెన్సీలో పనిచేసేది.అక్కడకు వచ్చే కస్టమర్లలో బాగా డబ్బున్నవాళ్లను గుర్తించి, వాళ్లను తన అందంతో ఆకర్షించేదని, గోవర్ధన్ విలాస్ ప్రాంతంలోని తన అపార్టుమెంటుకు రప్పించేదని పోలీసులు తెలిపారు. 
 
అక్కడకు వెళ్లిన తర్వాత వాళ్లకు బీరులో డ్రగ్స్ కలిపి ఇచ్చేదని, తర్వాత వాళ్లతో అశ్లీల వీడియోలు రూపొందించి, వాటిని సీడీలుగా మార్చి వాటితో బెదిరించేదని చెప్పారు. ఎట్టకేలకు రఫీక్ మహ్మద్ అనే వ్యక్తి ఆమె ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్లు రంగంలోకి దిగి ఆమెను అరెస్టు చేశారు. ఈమె వద్ద ఎందరో ధనవంతుల సీడీలు ఉన్నట్లు సమాచారం 

Share this Story:

Follow Webdunia telugu