Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏకాంతం కోసమైతే వేరు కాపురం సమంజసమే : ఢిల్లీ హైకోర్టు తీర్పు

భార్యాభర్తల ఏకాంతం కోసమైతే వేరు కాపురం పెట్టడంలో ఎలాంటి తప్పు లేదనీ, కానీ, హిందూ భర్తను తల్లిదండ్రులకు సేవ చేసుకోనీయకుండా అడ్డుకొనేందుకు వేరు కాపురం పెట్టేందుకు ఒత్తిడి చేసే భార్య ప్రవర్తన క్రూరత్వం క

ఏకాంతం కోసమైతే వేరు కాపురం సమంజసమే : ఢిల్లీ హైకోర్టు తీర్పు
, సోమవారం, 17 అక్టోబరు 2016 (09:00 IST)
భార్యాభర్తల ఏకాంతం కోసమైతే వేరు కాపురం పెట్టడంలో ఎలాంటి తప్పు లేదనీ, కానీ, హిందూ భర్తను తల్లిదండ్రులకు సేవ చేసుకోనీయకుండా అడ్డుకొనేందుకు వేరు కాపురం పెట్టేందుకు ఒత్తిడి చేసే భార్య ప్రవర్తన క్రూరత్వం కిందకే వస్తుందని ఇటీవల సుప్రీంకోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది. 
 
అయితే, ఏకాంతం(ప్రైవసీ) కారణంతో భార్య వేరుకాపురం కోరడం సమంజసమేనని ఇదే కోర్టు తేల్చిచెప్పింది. మెట్టినింట్లో మహిళ ఏకాంతం కోరుకుంటే దాన్ని భర్తపట్ల క్రూరత్వంగా పరిగణించరాదని, ఆ కారణంతో విడాకులు ఇవ్వడం కుదరదని స్పష్టీకరించింది. 'ఏకాంతమంటే ఎవరూ తనను గమనించని, తన ఏకాగ్రతకు భంగం కలిగించని స్థితి' అని తెలిపింది.
 
ఒక మహిళ వివాహబంధంలోకి ప్రవేశించినపుడు ఆమెకు ఏకాంతాన్ని కల్పించడం మెట్టినింటి వారి బాధ్యతని జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌, జస్టిస్‌ దీపా శర్మలతో కూడిన తేల్చిచెప్పింది. క్రూరత్వం కారణంతో తన వివాహాన్ని రద్దు చేయాలని భర్త పెట్టుకున్న పిటిషన్‌ను 2010లో కింది కోర్టు కొట్టేసింది. అయితే, తాజాగా హైకోర్టు కూడా భర్త అప్పీలును తోసిపుచ్చుతూ కింది కోర్టు తీర్పును సమర్థించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉత్తరప్రదేశ్ : రేప్‌ కేసు పెట్టిందని తుపాకీతో కాల్చిపారేసిన నిందితులు