Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమిళనాడు నాయకుడు ఎవరు? రజనీకాంతా? అజిత్ కుమారా?

తమిళనాట రాజకీయాలపై హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది. దివంగత సీఎం జయలలిత మరణం తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆమె నెచ్చెలి శశికళ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్‌ని మాజీ ఫైనాన్స్ మినిస్

తమిళనాడు నాయకుడు ఎవరు? రజనీకాంతా? అజిత్ కుమారా?
, గురువారం, 29 డిశెంబరు 2016 (11:31 IST)
తమిళనాట రాజకీయాలపై హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది. దివంగత సీఎం జయలలిత మరణం తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆమె నెచ్చెలి శశికళ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో సూపర్ స్టార్ రజినీకాంత్‌ని మాజీ ఫైనాన్స్ మినిస్టర్ చిదంబరం కలవడం ఆసక్తిగా మారింది. మరోవైపు శశికళని హీరో అజిత్ సీక్రెట్‌గా కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు బీజేపీ ఛాన్స్ దొరికితే తమ పార్టీని బలోపేతం చేయాలని ఉవ్విళ్లూరుతోంది.
  
ఇందులో భాగంగా ఏపీలో పవన్ కల్యాణ్‌ను వాడుకున్నట్లు.. అజిత్‌ని కూడా వాడుకునేందుకు బీజేపీ-శశికళ వర్గం ప్రయత్నాలు మొదలెట్టింది. అజిత్ గనక బీజేపీతో నో శశికళతోనో చేరితే ప్రత్యేక పార్టీ లాంటిది పెడితే అన్నాడీఎంకేకు పెద్ద సమస్యగా మారుతుంది. ప్రస్తుతం తమిళనాడు నాయకుడి కోసం ఎదురు చూస్తోంది. గత ఎన్నికలకంటే ముందే రజినీకాంత్‌ని బీజేపీ సాయం కోరింది. అందుకు ఆయన నో చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ తమకి చేతనైన పావులు కదుపుతోంది.
 
సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కాంగ్రెస్ సీనియర్ నేత - మాజీ మంత్రి పి.చిదంబరం ఆయన ఇంట్లో కలుసుకున్నారు. రజినీకాంత్‌ని కాంగ్రెస్‌కి సపోర్ట్ ఇచ్చే టైపులో చిదంబరం రిక్వస్ట్ చేసారు. కానీ ఆయన ఏం చెప్పారనేది ప్రస్తుతం సస్పెన్స్. మొత్తం మీద అజిత్-రజినీకాంత్‌లు ఇద్దరిలో ఒకరు తమిళనాట భవిష్యత్తు నాయకుడు అయితే తమిళ జనాలకి పండగే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెచ్చెలి శశికళకు పార్టీ పగ్గాలు.. హైకోర్టులో అమ్మ మృతిపై విచారణ..