Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వయలెంట్ పోర్న్ చిత్రాలంటే ఇండియన్ మగాళ్లకు మక్కువ... సీబీఐ రిపోర్ట్

వయలెంట్ పోర్న్ చిత్రాలంటే ఇండియన్ మగాళ్లకు మక్కువ... సీబీఐ రిపోర్ట్
, శుక్రవారం, 9 అక్టోబరు 2015 (14:51 IST)
పోర్నోగ్రఫీ... పోర్న్ చిత్రాలను చూడటాన్ని భారతదేశంలో నిషేధించాలంటూ ఆమధ్య కోర్టుల్లో పిటీషన్లు దాఖలు కావడం, ఆ తర్వాత ప్రభుత్వం నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించడం, ఆపైన ఇది తమ స్వేచ్ఛను హరించేదంటూ సోషల్ నెట్వర్కింగ్ సైట్లు వేదికగా నెటిజన్లు నిరసనలు తెలుపడం తెలిసిందే. ఇప్పుడు సీబీఐ చేపట్టిన దర్యాప్తులో చేదు నిజాలు బయటకు వచ్చాయి. అదేమంటే... భారతదేశంలోని పురుషులు ఎక్కువగా హింసాత్మక పోర్న్ చిత్రాలంటే మక్కువ చూపుతున్నారనీ, వాటిని చూసేందుకు ఎగబడుతున్నట్లు తేలింది. 
 
సీబీఐ తన అఫిడవిట్లో ఈ విషయాలను ఉటంకించింది. మహిళల పట్ల హింసాత్మక ప్రవృత్తి, హింసాత్మకమైన పోర్న్ చిత్రాలను పురుషులు అధికంగా చూస్తున్నట్లు తెలిపింది. దీన్నిబట్టి హింసాత్మకమైన సైబర్ పోర్నోగ్రఫీని ఇండియా నుంచి తరిమివేయడం కష్టసాధ్యమైనదిగా కనబడుతున్నట్లు వారు అభిప్రాయపడ్డారు. ఈ పోర్న్ చిత్రాల వీక్షణ వల్ల పురుషుల్లో నేరప్రవుత్తి మరింత పెరుగుతోందనీ, అత్యాచారాలు పెచ్చుమీరుతున్నాయనీ, అమాయక బాలికలపై లైంగిక వేధింపులు అధికమవుతున్నట్లు వెల్లడించారు. 
 
హింసాత్మక పోర్న్ చిత్రాల మార్కెట్ స్థాయి దేశంలో ఎక్కువగా ఉండటంతో అలాంటి వాటిని కంటెంట్ ప్రొవైడర్స్ అప్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ వాటిని కనుగొని బ్లాక్ చేసినప్పటికీ మళ్లీ తిరిగి జోడిస్తున్నట్లు వెల్లడించారు. అలాంటి వారిని ప్రొసిక్యూట్ చేసేందుకు పూర్తి అధికారాలు ఇవ్వాలని తెలియజేశారు. మరి సుప్రీంకోర్టు దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu