గుజరాత్‌లో హనీట్రాప్, బ్లాక్‌మెయిలింగ్‌కు సంబంధించిన ఒక దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒక బిల్డర్‌ను ఒక మహిళ హనీట్రాప్‌లో ఇరికించి, ఆ తర్వాత నగ్న వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించింది. ఈ ఘటన అహ్మదాబాద్‌లో జరిగింది. ఒక మహిళ, ఒక జర్నలిస్ట్ కలిసి ఒక బిల్డర్‌ను నగ్న వీడియోలను విడుదల చేస్తామని బెదిరించి రూ.10 కోట్లు డిమాండ్ చేశారు.
అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిందితురాలైన మహిళను, స్థానిక పత్రికలో ఎడిటర్‌గా పనిచేస్తున్న జర్నలిస్ట్‌ను అరెస్టు చేశారు. ఈ నేరానికి సూత్రధారిగా భావిస్తున్న, ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ మహిళ స్నేహితురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ ఇచ్చిన వివరాల ప్రకారం, నిందితురాలు సునీతా రాజ్‌పుత్ బహుళ వ్యాపారాలు నిర్వహిస్తోంది. సునీత అహ్మదాబాద్‌లో బిల్డర్‌ను హనీ-ట్రాపింగ్ చేయడం ప్రారంభించిందని ఆరోపించారు. వారు సన్నిహితంగా ఉన్నప్పుడు, 12వ తరగతి పాసైన సునీత, బిల్డర్ అనుమతి లేకుండా నగ్న వీడియోలను రికార్డ్ చేసింది. ఆపై గుజరాత్ ప్రదేశ్ ఎన్‌సిపి వైస్ ప్రెసిడెంట్, స్థానిక వార్తాపత్రిక ఎడిటర్ అయిన అశ్విన్ చౌహాన్ ఎంట్రీ ఇచ్చారు. సునీత ఆ క్లిప్‌లను అశ్విన్‌కు అందజేసింది.
చౌహాన్ నగ్న వీడియోలను బిల్డర్‌కు పంపి బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడని సైబర్ క్రైమ్ బ్రాంచ్‌కు చెందిన ఎసిపి హార్దిక్ మంకాడియా తెలిపారు. అతను బిల్డర్ నుండి రూ.10 కోట్లు డిమాండ్ చేశాడు. లేదంటే వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు.
నిరంతర బెదిరింపులతో విసిగిపోయిన బిల్డర్ చివరికి అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. విచారణలో సునీత, అశ్విన్ నేరాన్ని అంగీకరించారు. బాధితుడిని హనీట్రాప్ చేసి డబ్బు గుంజాలనే పథకాన్ని సునీత స్నేహితురాలు బిని గిల్ రూపొందించింది. ఆమె ఒక ట్రైనర్‌గా పనిచేసేది.
తన స్నేహితుల గురించి తెలియగానే ఆమె పరారైంది. బిల్డర్‌కు తెలియకుండా వీడియోలను రికార్డ్ చేయడానికి నిందితులు స్పై కెమెరాను ఉపయోగించారని పోలీసులు వెల్లడించారు. ఇక అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 308(2), 351(2), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 66(e) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ప్రస్తుతం పరారీలో ఉన్న మూడవ నిందితుడి కోసం పోలీసుల బృందం గాలిస్తోంది.