Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొడుకు పుట్టలేదని.. తన పురుషాంగాన్ని తానే కత్తితో కోసుకున్న కోపిష్టి!

కొడుకు పుట్టలేదని.. తన పురుషాంగాన్ని తానే కత్తితో కోసుకున్న కోపిష్టి!
, శుక్రవారం, 12 సెప్టెంబరు 2014 (14:30 IST)
బీహార్‌లో ఓ విచిత్రమైన ఘోరం జరిగింది. తన భార్యకు మగ పిల్లవాడు జన్మించలేదని, దానికి కారణం తానే అంటూ కోపంతో తన అంగాన్ని తానే కత్తితో కోసుకుని మృత్యువాత పడ్డాడు ఓ వ్యక్తి. బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ విచిత్ర సంఘటన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి.
 
వివరాలు చూస్తే... బీహార్ రాష్ట్రంలోని సివాన్ జిల్లా ఖోజ్వా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి (30) ఖతార్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారసుడు కావాలంటూ అతను నిత్యం భార్యతో గొడవపడుతుండేవాడు. ఈ నేపథ్యంలో.. నెల రోజుల సెలవు నిమిత్తం అతను స్వస్థలానికి వచ్చాడు. 
 
ఇంటికి వచ్చిన తర్వాత మగబిడ్డ కావాలంటూ ఎప్పట్లాగే భార్యతో గొడవపడ్డాడు. ఈ గొడవలో భార్యాభర్తల మధ్య ఎలాంటి వాగ్యుద్ధం జరిగిందో కానీ అతను ఆవేశంలో తన పురుషాంగాన్ని పదునైన చాకుతో కోసేసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతనిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోసేసిన మర్మాంగం ఏమైపోయిందో వివరాలు తెలియ రావడం లేదని పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu