Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బ్లాక్‌మని నిరోధానికి సమగ్ర బిల్లు: అరుణ్ జైట్లీ ప్రకటన..!

బ్లాక్‌మని నిరోధానికి సమగ్ర బిల్లు: అరుణ్ జైట్లీ ప్రకటన..!
, ఆదివారం, 1 మార్చి 2015 (11:19 IST)
దేశంలో బ్లాక్‌మని నిరోధానికి తాము తీవ్రంగా పోరాడుతున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. అందుకోసం సమగ్ర బిల్లు రూపకల్పన చేస్తామని ఆయన ప్రకటించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే బ్లాక్‌మని నిరోధక బిల్లు ప్రవేశపెడుతామని తెలిపారు. బ్లాక్‌మని నియంత్రణ కోసం ఆదాయపన్ను చట్టంలో సవరణ చేస్తామన్నారు. 
 
పన్ను ఎగవేతదారులకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తామని హెచ్చరించారు. విదేశీ ఆస్తులు వెల్లడించకపోయినా, వివరాలు సక్రమంగా లేకపోయినా కఠిన శిక్ష తప్పదన్నారు. అదేవిధంగా మనీల్యాండరింగ్ చట్టాల్లో మార్పులు, సవరణలు చేస్తామని ప్రకటించారు.

ఇతర దేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలు వెల్లడించకపోతే సమానస్థాయి దేశంలో ఉన్న ఆస్తులను జప్తు చేస్తామన్నారు. బినామీ ఆస్తులపై కొరడా ఝులిపిస్తామని హెచ్చరించారు. ఈ చర్యలు అన్ని బ్లాక్‌మని నియంత్రణ కోసం అనే విషయాన్ని గుర్తించాలని అరుణ్ జైట్లీ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu