Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశవ్యాప్తంగా 21 నకిలీ యూనివర్శిటీలు... జాబితాను వెల్లడించిన యూజీసీ

దేశవ్యాప్తంగా 21 నకిలీ యూనివర్శిటీలు... జాబితాను వెల్లడించిన యూజీసీ
, బుధవారం, 1 జులై 2015 (15:44 IST)
దేశంలో నానాటికీ పెరిగిపోతున్న విద్యా సంబంధిత నేరాలను అడ్డుకునేందుకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నడుంకట్టింది. అందుకోసం దేశవ్యాప్తంగా చట్టవిరుద్ధంగా ఏర్పాటై కార్యకలాపాలను సాగిస్తున్న 21 నకిలీ యూనివర్శిటీలను గుర్తించింది. ఆ నకిలీ యూనివర్శిటీల జాబితాలను బుధవారం యూజీసీ విడుదల చేసింది.

ఆ జాబితా ప్రకారం ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా ఎనిమిది నకిలీ యూనివర్శిటీలు ఉండగా, దేశ రాజధాని నగరంలో 6 నకిలీ వర్శిటీలు ఉన్నట్టు వెల్లడించింది. యూజీసీ విడుదల చేసిన నకిలీ యూనివర్శిటీల పేలర్లు. మైథిలి యూనిర్శిటీ (బీహార్), వరణ్ సేయ సంస్కృత్ విశ్వవిద్యాలయ (ఢిల్లీ), కమర్షియల్ యూనివర్శిటీ లిమిటెడ్ (ఢిల్లీ).
 
యునైటెడ్ నేషన్స్ యూనివర్శిటీ (ఢిల్లీ), వొకేషనల్ యూనివర్శిటీ (ఢిల్లీ), ఏడీఆర్-సెంట్రల్ జ్యూరిడికల్ యూనివర్శిటీ (ఢిల్లీ), ఇండియన్ ఇన్ స్టిట్యూషన్ ఆఫ్ , సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (ఢిల్లీ), బదగ్నావి సర్కార్ వరల్డ్ ఓపెన్ ఎడ్యుకేషనల్ సొసైటీ (కర్ణాటక), సెయింట్ జాన్స్ యూనివర్శిటీ (కేరళ), కేశర్వాణి విద్యాపీఠ్ (జబల్పూర్-మధ్యప్రదేశ్), రజా అరబిక్ యూనివర్శిటీ (మహారాష్ట్ర), డీడీబీ సంస్కృత్ యూనివర్శిటీ (తమిళనాడు), ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ , మెడిసిన్ (పశ్చిమ బెంగాల్).
 
మహిళా గ్రామ్ విద్యాపీఠ్ (ఉత్తరప్రదేశ్), గాంధీ హిందీ విద్యాపీఠ్ (ఉత్తరప్రదేశ్), నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి (ఉత్తరప్రదేశ్), నేతాజి సుభాష్ చంద్రబోస్ యూనివర్శిటీ (ఉత్తరప్రదేశ్), ఉత్తరప్రదేశ్ విశ్వవిద్యాలయ (ఉత్తరప్రదేశ్), మహారాణా ప్రతాప్ శిక్షా నికేతన్ విద్యాలయ (ఉత్తరప్రదేశ్), ఇంద్రప్రస్థ శిక్షా పరిషత్ (ఉత్తరప్రదేశ్), గురుకుల్ విశ్వవిద్యాలయ (ఉత్తరప్రదేశ్)గా యూజీసీ వెల్లడించింది.

Share this Story:

Follow Webdunia telugu