షోపియన్‌ తోటలో నక్కి వున్న ఇద్దరు లష్కర్ హైబ్రిడ్ ఉగ్రవాదుల అరెస్టు

ఐవీఆర్
గురువారం, 29 మే 2025 (17:27 IST)
భద్రతా దళాలు, జమ్ముకాశ్మీర్ పోలీసులు పరస్పర సమన్వయంతో SOG షోపియన్ నిర్దిష్ట ఇన్‌పుట్‌ల ఆధారంగా దక్షిణ కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలోని బాస్కుచాన్ ప్రాంతంలో ప్రారంభించిన కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్(CASO)లో లష్కర్-ఎ-తోయిబా (LeT)కి చెందిన ఇద్దరు హైబ్రిడ్ ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు.
 
ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సమీపంలోని తోటలో ఉగ్రవాదుల కదలికను గమనించారని వారు తెలిపారు. ఉమ్మడి బృందాలు సమన్వయ చర్య కారణంగా, ఇద్దరు ఉగ్రవాదులు విజయవంతంగా లొంగిపోయారు. వారిని అరెస్టు చేసారు. వారిద్దరూ ఇర్ఫాన్ బషీర్, ఉజైర్ సలామ్‌గా గుర్తించారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలలో రెండు AK-56 రైఫిళ్లు, నాలుగు మ్యాగజైన్‌లు, 7.62x39mm 102 రౌండ్లు, రెండు హ్యాండ్ గ్రెనేడ్‌లు, రెండు పౌచ్‌లు, రూ. 5,400 నగదు, ఒక మొబైల్ ఫోన్, ఒక స్మార్ట్‌వాచ్, రెండు బిస్కెట్ ప్యాకెట్లు, ఒక ఆధార్ కార్డు ఉన్నాయని అధికారులు తెలిపారు. సంబంధిత విభాగాల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడి తదుపరి దర్యాప్తు జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments