Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహిళపై ఆప్‌ ఎమ్మెల్యే హత్యాయత్నం.. అరెస్టు చేయించిన సీఎం కేజ్రీవాల్

ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యే ఒకరు ఓ మహిళపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఆయనను ఆప్ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు చేయించారు. అలాగే, దైవదూషణ కేసులో మరో ఆప్ ఎమ్మెల్యే అరెస్టు అయ్యారు. ఈ

మహిళపై ఆప్‌ ఎమ్మెల్యే హత్యాయత్నం.. అరెస్టు చేయించిన సీఎం కేజ్రీవాల్
, సోమవారం, 25 జులై 2016 (08:28 IST)
ఢిల్లీలో ఆప్ ఎమ్మెల్యే ఒకరు ఓ మహిళపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. దీంతో ఆయనను ఆప్ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు చేయించారు. అలాగే, దైవదూషణ కేసులో మరో ఆప్ ఎమ్మెల్యే అరెస్టు అయ్యారు. ఈ రెండు సంఘటనలు ఆదివారం చోటుచేసుకున్నాయి. 
 
ఢిల్లీ పోలీసుల కథనం ప్రకారం.. విద్యుత కోతపై నిలదీసేందుకు ఈ నెల 10న ఓ మహిళ ఢిల్లీ జామియా నగర్‌లోని ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ ఇంటికి వెళ్లింది. ఆయన లేకపోవడంతో వెనుదిరిగింది. ఇంతలో ఓ వాహనం ఆమెపైకి దూసుకొచ్చింది. ఆ వాహనంలో ఎమ్మెల్యేని చూశానని శుక్రవారం పోలీసులకు బాధితురాలు పేర్కొంది. 
 
ఈ ఘటన జరిగిన వారం తర్వాత మరోసారి ఎమ్మెల్యేను కలవడానికి వెళ్లగా.. అక్కడున్న యువకుడు తనను దుర్భాషలాడాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. వ్యవహారాన్ని రచ్చకెక్కిస్తే అంతు చూస్తామని అతడు హెచ్చరించాడని ఆరోపించింది. ఈ ఫిర్యాదుల ఆధారంగా ఆదివారం అమానతుల్లా ఖాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 
 
మరో ఘటనలో ఢిల్లీలోని మెహ్రౌలీ ఆప్‌ ఎమ్మెల్యే నరేశ్‌ యాదవ్‌ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. పంజాబ్‌లో నరేశ్‌ దైవ దూషణ చేసినట్లు దాఖలైన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్న ఆ రాష్ట్ర పోలీసులు ఆదివారం ఢిల్లీలో ఆయన్ను అదుపులోకి తీసుకొన్నారు. ఈ వరుస అరెస్టులపై ఆప్‌ కార్యకర్తలు రోడ్డెక్కారు. ఈ రెండు సంఘటనలు ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బలాంటివి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమించి పార్కుల వెంట తిరుగుతోందని కుమార్తె - ఆమె ప్రియుడిని హత్య చేసిన తండ్రి!