Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పార్కింగ్ ఏరియా, అపార్ట్‌మెంట్లలో సెక్స్: టీవీ యాక్టర్ యష్ పండిట్‌పై రేప్ కేసు

పార్కింగ్ ఏరియా, అపార్ట్‌మెంట్లలో సెక్స్: టీవీ యాక్టర్ యష్ పండిట్‌పై రేప్ కేసు
, బుధవారం, 25 నవంబరు 2015 (19:12 IST)
బుల్లితెర నటుడు యష్ పండిట్‌పై అత్యాచారం కేసులు నమోదైనాయి. యష్ పండిట్ ఒక సీరియల్‌లో నటిస్తుండగా.. ఓ యువతి పరిచయమైంది. ఈ పరిచయం ఆసరాగా తీసుకుని యువతిని నమ్మించి అనేక సార్లు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. గత కొద్ది రోజులుగా యష్ కనిపించకుండా పారిపోవడంతో పాటు బాధిత యువతి యష్‌ పండిట్‌కు ఫోన్ చేసింది. ఆమె ఫోన్‌కు యష్ స్పందించకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
 
యష్ పండిట్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అంతేగాకుండా ముంబై సెషన్స్ కోర్టులో పండిట్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడని పోలీసులు చెప్పుకొచ్చారు. 34 ఏళ్ల యష్ పండిట్ పార్కింగ్ ఏరియాలోనే ఆ యువతితో సెక్సుకు పాల్పడేవాడని, కొన్ని సందర్భాల్లో తన అపార్ట్‌మెంట్‌కు కూడా ఆమెను తీసుకెళ్లి అత్యాచారం చేశాడని.. పెళ్లి చేసుకుంటానని తప్పుడు ప్రామిస్‌లతో నెట్టుకొచ్చిన అతనిని తల్లిదండ్రులతో పెళ్లి కోసం మాట్లాడాల్సిందిగా బాధిత యువతి కోరడంతో ఫోనును స్విచ్ఛాప్ చేసి పరారి అయినట్లు పోలీసులు వెల్లడించారు.  

Share this Story:

Follow Webdunia telugu