Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యూపీలో ప్రభుత్వ వైద్యుడు ఏం చేశాడో తెలుసా.. 17 మంది మహిళలకు మత్తు మందిచ్చి?

ఉత్తరాదిన ప్రభుత్వ వైద్యులు, వైద్య శాలలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆసుపత్రులకు వెళ్లాలంటే కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వుండటంతో.. నిరుపేదలు మరణిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఉత్తరప

యూపీలో ప్రభుత్వ వైద్యుడు ఏం చేశాడో తెలుసా.. 17 మంది మహిళలకు మత్తు మందిచ్చి?
, గురువారం, 1 సెప్టెంబరు 2016 (11:19 IST)
ఉత్తరాదిన ప్రభుత్వ వైద్యులు, వైద్య శాలలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఆసుపత్రులకు వెళ్లాలంటే కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వుండటంతో.. నిరుపేదలు మరణిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఓ ప్రభుత్వ వైద్యుడు 17 మంది మహిళల ప్రాణాలతో చెలగాటం ఆడాడు. మత్తు మందు ఇచ్చిన తర్వాత ఆపరేషన్ చేయకుండా వెళ్లిపోయాడు. మహరాజ్ గంజ్ బ్లాకులోని జాన్ పూర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. 
 
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునేందుకు వచ్చిన 17 మంది మహిళలకు డాక్టర్ ప్రవీణ్ కుమార్ ఆదేశాలకు మేరకు వైద్యసిబ్బంది మత్తు ఇచ్చారు. అయితే ఆపరేషన్ చేసేందుకు అవసరమైన సామాగ్రి లేదని ప్రవీణ్ కుమార్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఎంతసేపైనా డాక్టర్ రాకపోవడంతో మహిళల బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో ఆసుపత్రి నిర్వాకం స్పందించి ప్రవీణ్ కుమార్‌ను రప్పించింది. 
 
ఇలా నాలుగు గంటలు గడిచిన తర్వాత తీరిగ్గా రాత్రి 9 గంటల సమయంలో ప్రవీణ్ కుమార్ తిరిగొచ్చాడు. ఎనస్తీషియా తీసుకున్న 17 మంది మహిళలు అప్పటికే వెళ్లిపోయారు. మిగిలిన 13 మంది మహిళలకు రాత్రి 11 గంటలకు వరకు ఆపరేషన్ చేశాడు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్ ను డీఎం ఆదేశాలు జారీ చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రత్యేక హోదాపై బీజేపీ నీళ్లు చల్లినట్టేనా? పవన్ కళ్యాణ్ రోడ్లపైకి వస్తారా?