Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్మోకింగ్‌తో కేన్సర్ రాదట: బీజేపీ ఎంపీ దిలీప్ గాంధీ కామెంట్స్

స్మోకింగ్‌తో కేన్సర్ రాదట: బీజేపీ ఎంపీ దిలీప్ గాంధీ కామెంట్స్
, బుధవారం, 1 ఏప్రియల్ 2015 (10:50 IST)
స్మోకింగ్‌తో కేన్సర్ రావడం ఖాయమని అనేక పరిశోధనలు తేల్చిన నేపథ్యంలో.. ఓ ఎంపీగారు మాత్రం ఈ తరహా ముప్పు పొంచి ఉందని భారత్‌లో ఏ పరిశోధన తేల్చలేదని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పొగాకు ఉత్పత్తులన్నింటిపై హెచ్చరిక చిహ్నాలు 85 శాతం మేర ముద్రించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు నేటి నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో గాంధీ నిన్న చేసిన ప్రకటన, మోదీ సర్కారును ఇరకాటంలోకి నెట్టింది. 
 
పొగాకు ఉత్పత్తుల చట్టం-2003 పై వేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా ఉన్న గాంధీ ఈ వ్యాఖ్య చేయడం గమనార్హం. ‘‘ పొగాకుతో కేన్సర్ వస్తుందని భారత్‌లో ఏ పరిశోధనా తేల్చలేదు. ధూమపానంతో కేన్సర్ ముప్పు పొంచి ఉందని చెప్పిన పరిశోధనలన్నీ విదేశాల్లో జరిగినవే. ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్‌లలో బీడీ తయారీపై ఆధారపడి 4 కోట్ల మంది పనిచేస్తున్నారు’’ అని దిలీప్ గాంధీ వ్యాఖ్యానించారు.
 

Share this Story:

Follow Webdunia telugu