Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫ్యాన్సీ నెంబర్ కోసం రూ. 8.5లక్షలు చెల్లించిన ఎల్డీ మిట్టల్!

ఫ్యాన్సీ నెంబర్ కోసం రూ. 8.5లక్షలు చెల్లించిన ఎల్డీ మిట్టల్!
, మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (15:41 IST)
ప్రముఖ ట్రాక్టర్ల తయారీ సంస్థ 'సోనాలికా' ఛైర్మన్ ఎల్‌డీ మిట్టల్ కొత్త కారుకు ఫ్యాన్సీ నెంబర్ కోసం ఏకంగా రూ. 8.5 లక్షలు చెల్లించారు. చండీగఢ్‌‌లో సీహెచ్ 01 ఏజెడ్ సిరిస్‌లో 0001 నెంబర్ కోసం రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్సింగ్ అథారిటీ (ఆర్‌ఎల్‌ఏ) అధికారులు బహిరంగ వేలం నిర్వహించారు.
 
ఈ వేలంలో పాల్గోన్న సోనాలికా గ్రూప్‌కు చెందిన నూతన 'మెర్సిడిస్ ఎస్' క్లాస్ కారు కోసమని ఈ నెంబర్ కొనుగోలు చేశామని ఆ సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. కాగా, 2013లో సీహెచ్ 01 ఏటీ సిరిస్‌లో 0001 నెంబర్ కోసం వేలం నిర్వహించగా, ఓ వ్యక్తి ఆ నెంబర్‌ను రూ. 9.1 లక్షలకు దక్కించుకున్నారని ఆర్ఎల్ఏ అధికారులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu