Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉగ్రవాదుల్లో ఓ మహిళ... సరిహద్దుల్లో హై అలెర్ట్.. రాజనాథ్ సింగ్ ఆదేశం..

ఉగ్రవాదుల్లో ఓ మహిళ... సరిహద్దుల్లో హై అలెర్ట్.. రాజనాథ్ సింగ్ ఆదేశం..
, సోమవారం, 27 జులై 2015 (12:27 IST)
పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్ పూర్ జిల్లా దీనానగర్ పోలీస్ స్టేషన్‌పై జరిగిన ఉగ్రదాడిలో తొమ్మిది మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. సైన్యం, పంజాబ్ పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇప్పటి వరకు ఒక ఉగ్రవాది కూడా హతమైనట్టు సమాచారం. ఈ దాడులకు పాల్పడిన ఉగ్రవాదుల్లో ఒక మహిళ కూడా ఉన్నట్టు తాజాగా సమాచారం అందింది. గాయపడిన ఒక పోలీసు ఈ విషయాన్ని తెలిపినట్టు సమాచారం. 
 
భారత్‌పై జరిగిన ఉగ్రవాడుల్లో ఇప్పటి వరకు మహిళలు ఉన్నట్టు ఎప్పుడూ తెలియలేదు. అయితే సోమవారం జరిగిన దాడిలో మహిళా ఉగ్రవాది ఉన్న విషయం సంచలనంగా మారింది. దీంతో పాక్ టెర్రరిస్టులు కూడా ఐఎస్ ఉగ్రవాదుల వలే మహిళలను కూడా తమతో చేర్చుకుంటున్నారని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటన అందాల్సి ఉంది. 
 
ఇదిలా ఉండగా ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉగ్రదాడులపై పూర్తిగా దృష్టి సారించారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలికి చేరుకుని పంజాబ్ పోలీసులకు సహకరించాలని బీఎస్ఎఫ్ బలగాలను ఆదేశించారు. మరోవైపు, అంతర్జాతీయ సరిహద్దుపై పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని... భారత్ - పాక్ సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీచేశారు. ఇదే విధంగా మెట్రో సిటీల్లో కూడా హై అలెర్ట్‌ను ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu