Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బెంగళూర్‌లో మళ్లీ మరో బాలికపై అత్యాచారం.. టీచర్ అరెస్టు

బెంగళూర్‌లో మళ్లీ మరో బాలికపై అత్యాచారం.. టీచర్ అరెస్టు
, శుక్రవారం, 31 అక్టోబరు 2014 (15:05 IST)
బెంగళూర్‌లో మళ్లీ మరో బాలికపై అత్యాచారం జరిగింది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఓ స్కూల్లో ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విధంగా గత మూడు నెలల్లో బెంగుళూరులో బాలికలపై జరిగిన అత్యాచార ఘటనల్లో ఇది ఆరోది.
 
పోలీసుల విచారణలో మంగళ, బుధ వారాల్లో రెండుసార్లు ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు సదరు టీచర్ అంగీకరించాడని బెంగళూరు అదనపు పోలీసు కమిషన్ (శాంతిభద్రతలు) అలోక్ కుమార్ తెలిపారు.
 
స్కూలు నుంచి ఇంటికి వెళ్లిన బాలిక తనకు బాగా నొప్పిగా ఉందని చెప్పడంతో వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా, ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు ఆ వైద్యుడు చెప్పారు. దీంతో గురువారం నాడు పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu