Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

త‌మిళ‌నాడులో స్తంభించిన జ‌న‌జీవ‌నం... బంద్ ప్రశాంతం

తమిళనాడులో జనజీవనం స్తంభించిపోయింది. కావేరీ జలాల విడుదల వ్యవహారంలో కర్నాటక ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా తమిళనాడు రాష్ట్రంలో బంద్ జరుగుతున్న విషయంతెల్సిందే.

త‌మిళ‌నాడులో స్తంభించిన జ‌న‌జీవ‌నం... బంద్ ప్రశాంతం
, శుక్రవారం, 16 సెప్టెంబరు 2016 (15:35 IST)
తమిళనాడులో జనజీవనం స్తంభించిపోయింది. కావేరీ జలాల విడుదల వ్యవహారంలో కర్నాటక ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా తమిళనాడు రాష్ట్రంలో బంద్ జరుగుతున్న విషయంతెల్సిందే. ఈ బంద్‌కు రాష్ట్రంలోని అని విపక్ష పార్టీలతో పాటు ప్రజా సంఘాలు కూడా సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించి పోయింది. 
 
వ్యవసాయ సంఘాలకు సంఘీభావంగా రాష్ట్రంలో ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు, లారీ యజమానుల సంఘం బంద్‌ పాటించాయి. దీంతో వ్యక్తి గత వాహనాలు, ప్రభుత్వ వాహనాలు పరిమిత సంఖ్యలో ఆటోలు రోడ్లపై తిరిగాయి. వ్యవసాయ సంఘాలకు వాణిజ్య సంఘాలు కూడా మద్దతునివ్వడంతో రాష్ట్రంలో వాణిజ్య సముదాయాలు, దుకాణాలు, శుక్రవారం మూసివేశారు. అలాగే రాష్ట్రంలో సినిమా థియేటర్లు కూడా పగటి వేళ రెండు ఆట‌లను రద్దు చేశాయి. బంద్‌కు తమిళ చలన చిత్ర వాణిజ్య మండలి కూడా తమ మద్దుతు తెలపడంతో షూటింగులు సైతం జరగ లేదు. 
 
బంద్‌ పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరిస్తే తగు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు బంద్‌లో పాల్గొనలేదు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా పనిచేశాయి. ప్రభుత్వ విద్యాలయాలు కూడా పని చేశాయి. పలు ప్రైవేట్ సంస్థలు సెలవు ప్రకటించడంతో ఉద్యోగులు ఇళ్లకే పరిమితమయ్యారు. పలు చోట్ల రైల్ రోకో నిరసన కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతిపక్ష నేత‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తంమీద బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీ నెంబరును జియోకు మార్చాలా? అబ్బే కుదర్దు... ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్లపై Jio ఫైర్