సీబీఐ చేతికి స్వాతి హత్య కేసు..? హైకోర్టులో రామ్ కుమార్ తల్లి పిటిషన్ దాఖలు
చెన్నై నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో దారుణంగా హత్యకు గురైన టెక్కీ స్వాతి హత్య కేసును సీబీఐ చేతికి వెళ్లనుందని టాక్ వస్తోంది. స్వాతి కేసును సీబీఐ చేత విచారణ జరిపించాలని రామ్ కుమార్ తల్లి పుష్పం హైకోర్టు
చెన్నై నుంగంబాక్కం రైల్వే స్టేషన్లో దారుణంగా హత్యకు గురైన టెక్కీ స్వాతి హత్య కేసును సీబీఐ చేతికి వెళ్లనుందని టాక్ వస్తోంది. స్వాతి కేసును సీబీఐ చేత విచారణ జరిపించాలని రామ్ కుమార్ తల్లి పుష్పం హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం పుళల్ సెంట్రల్ జైలులో ఉంటున్న రామ్‌కుమార్‌కు బెయిల్ కోసం ఆయన తరపు న్యాయవాదులు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో స్వాతి హత్య కేసును సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరుతూ రామ్‌కుమార్ తల్లి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి పీఎన్ ప్రకాశ్ విచారణ జరిపారు.
రామ్‌కుమార్ తల్లి తరపు న్యాయవాది రామరాజ్ తన వాదనలను వినిపిస్తూ స్వాతి వంటిపై ఉన్న గాయాలను చూస్తే ఒక వ్యక్తి ఆమెను హత్య చేసినట్లు భావించలేమని పేర్కొన్నారు. స్వాతి హత్య కేసును నుంగంబాక్కం పోలీసులు సక్రమంగా విచారణ జరపలేదనీ న్యాయవాదులు అంటున్నారు.
స్వాతి హత్య జరిగిన వెంటనే ముత్తుకుమార్, ఇస్మాయిల్ అనే ఇరువురికి ఆ హత్యతో సంబంధం ఉన్నట్టు పుకార్లు వచ్చాయని, అయితే పోలీసులు ఈ ఇరువురి వద్ద విచారణ జరపలేదని ఆరోపించారు.