Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాబ్రీ కేసులో బీజేపీ నేతలకు సుప్రీం నోటీసులు.. అద్వానీకి ముందు

బాబ్రీ కేసులో బీజేపీ నేతలకు సుప్రీం నోటీసులు.. అద్వానీకి ముందు
, బుధవారం, 1 ఏప్రియల్ 2015 (06:58 IST)
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ నాయకులకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయిన వారిలో భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్ కే అద్వానీతో పాటు 15 మంది ఉన్నారు. నాటి ఘటనపై స్పందించి వివరణ ఇవ్వాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. నేరపూరిత కుట్ర దాగి ఉందన్న కోణంలో వీరు విచారణ ఎదుర్కొంటున్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ తదితరులపై నేరపూరిత కుట్రకు సంబంధించిన ఐపీసీలోని సెక్షన్ 120బీ అభియోగాన్ని తొలగించారు. దీనిపై సవాలు చేసిన పిటిషన్‌పై మంగళవారం విచారణకు వచ్చింది. కేంద్రంలో ప్రభుత్వం మారినందువల్ల సీబీఐ ఈ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించే అవకాశముందంటూ హాజీ మొహమ్మద్ అహ్మద్ వేశారు. చీఫ్ జస్టిస్ హెచ్‌ఎల్ దత్తు, జస్టిస్ అరుణ్ మిశ్రాల ధర్మాసనం సీబీఐకి, అద్వానీ తదితరులకు నోటీసులు జారీ చేసింది. 
 
అంతకుముందు, బాబ్రీ కూల్చివేత కేసులో అద్వానీ సహా 19 మందిపై ‘నేరపూరిత కుట్ర’ ఆరోపణను తొలగిస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నేరపూరిత కుట్రను ఎందుకు తీసేయాలో చెప్పాలంటూ బీజేపీ నేతలు మురళీమనోహర్ జోషి, ఉమాభారతి, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ కళ్యాణ్ సింగ్‌తో పాటు మరో 15 మందికి ఈ నోటీసులు అందాయి.
 

Share this Story:

Follow Webdunia telugu