Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సునంద కేసు: నిజ నిర్ధారణ పరీక్షలు అవసరమే: ఢిల్లీ కోర్టు

సునంద కేసు: నిజ నిర్ధారణ పరీక్షలు అవసరమే: ఢిల్లీ కోర్టు
, బుధవారం, 20 మే 2015 (17:56 IST)
కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ సతీమణి సునందా పుష్కర్ మృతి కేసులో నిజానిజాలేంటో బయటపడాలంటే.. నిజ నిర్ధారణ పరీక్షలు అవసరమేనని ఢిల్లీ కోర్టు భావించింది. ఈ మేరకు శశిథరూర్ ఇంటి పనివారిపై పాలిగ్రాఫ్ టెస్ట్ జరిపేందుకు సిట్ (ప్రత్యేక దర్యాప్తు సంస్థ)కు అనుమతిచ్చింది. అయితే, ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలన్న విషయాన్ని మాత్రం కోర్టు స్పష్టంగా వెల్లడించలేదు.
 
సునంద మృతిపై పలు అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో కేసు విచారణను సిట్‌కు అప్పగించగా, శశిథరూర్ పనివాళ్లు నరేన్ సింగ్, డ్రైవర్ బజ్ రంగీ, సన్నిహితుడు సంజయ్ దేవాన్‌లు ఒక్కోసారి ఒక్కో విధమైన వాంగ్మూలాలు ఇచ్చారు. వీరు ఏవో నిజాలు దాస్తున్నారన్న అనుమానంతో వీరికి నిజ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు అనుమతించాలని కోరుతూ సిట్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
 
కాగా గత ఏడాది 2014 జనవరి 17వ తేదీన సునంద హోటల్ గదిలో విగతజీవిగా కనబడిన సంగతి తెలిసిందే. సునంద మరణం ఆత్మహత్య లేకుంటే హత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పాకిస్థాన్ జర్నలిస్ట్ తరర్‌తో శశిథరూర్ అఫైర్ ఉండటంతోనే సునంద పుష్కర్ ఆత్మహత్యకు పాల్పడి వుంటుందని అనుమానాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu