Publish Date: Fri, 06 Mar 2026 (10:02 IST)
Updated Date: Fri, 06 Mar 2026 (10:02 IST)
భారత వాయుసేనకు చెందిన సుఖోయ్-30 రకం యుద్ధ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో అందులోని ఇద్దరు పైలెట్లు దుర్మరణం పాలయ్యారు. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారికంగా ప్రకటించింది. అస్సాం రాష్ట్రంలోని కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో ఈ ఘటన జరిగినట్టు తెలిపింది.
ఈ యుద్ధ విమానం గురువారం సాయంత్రం జోర్హాట్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే గల్లంతైంది. రాడర్‌తో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో గాలింపు చర్యలు చేపట్టారు. జోర్హాట్ వైమానిక స్థావరానికి 60 కి.మీల దూరంలో ఉన్న కర్బి ఆంగ్లాంగ్ కొండ ప్రాంతంలో ఇది కూలిపోయినట్లు తాజాగా గుర్తించారు. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు.
ఆర్థం చేసుకునే నైపుణ్యం - వినగలిగే సామర్థ్యం తగ్గిపోయింది : నోరా ఫతేహి
ఇపుడు చాలా మందిలో విషయాన్ని అర్థం చేసుకునే నైపుణ్యం, వినగలిగే సామర్థ్యం తగ్గిపోయినట్టుందని బాలీవుడ్ నటి, డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫతేరా అన్నారు. ప్రపంచ శాంతి, ఐక్యతను కోరుతూ తాను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనివున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ శాంతికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ నోరా ఫతేరా ఓ వీడియో పోస్ట్ చేశారు. అయితే, ఈ వీడియోపై కొందరు నెటిజన్లు ఆమెపై ట్రోల్స్ చేశారు. దీనికి స్పందనగా నోరా ఫతేరా మరో వీడియోను రిలీజ్ చేశారు.
చాలా మందికి విషయాన్ని అర్థం చేసుకునే నైపుణ్యం, వినగలిగే సామర్థ్యం తగ్గిపోయినట్టుంది. శాంతియుతంగా జీవించాలని నేను ప్రపంచంలోని ప్రజలందరి గురించి మాట్లాడాను. గందరగోళానికి వ్యతిరేకంగా మాట్లాడాను. నా మాటలతో మీకు సమస్య ఉంటే నైతికంగా మీలోనే ఏదో లోపం ఉన్నట్టు. మిమ్మల్ని మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి అని ఘాటుగా వ్యాఖ్యానించారు.
నా మాటలు ఎవరినైనా బాధిస్తే లేదా చికాకు కలిగిస్తే సమస్య నాలో కాదు. ఆ సందేశాన్ని స్వీకరించలేని మీలోనే వుంది. ప్రపంచ శాంతి గురించి మాట్లాడితే కోపం తెచ్చుకునే ప్రపంచంలో మనం జీవిస్తున్నామంటే అది చాలా భయాకనమైన విషయం అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.