Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షారూక్‌ను అమెరికా అధికారులు ఆపడంలో తప్పేంలేదు... అమెరికా గాయం అలాంటిది... కమల్

షారూక్ ఖాన్‌ను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు లాస్ ఏంజిలిస్ విమానాశ్రయంలో నాలుగు గంటలపాటు నిర్బంధించడంపై ఏకంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా క్షమాపణలు చెప్పాడు. మన దేశంలో ఈ వ్యవహారంపై దుమ్మెత్తిపోస్తున్నారు. సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో తమతమ అభిప్రా

షారూక్‌ను అమెరికా అధికారులు ఆపడంలో తప్పేంలేదు... అమెరికా గాయం అలాంటిది... కమల్
, శుక్రవారం, 12 ఆగస్టు 2016 (17:48 IST)
షారూక్ ఖాన్‌ను అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు లాస్ ఏంజిలిస్ విమానాశ్రయంలో నాలుగు గంటలపాటు నిర్బంధించడంపై ఏకంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా క్షమాపణలు చెప్పాడు. మన దేశంలో ఈ వ్యవహారంపై దుమ్మెత్తిపోస్తున్నారు. సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో తమతమ అభిప్రాయాలను పోస్టు చేస్తున్నారు. కాగా నటుడు కమల్ హాసన్ మాత్రం కాస్త భిన్నంగా స్పందించారు. 
 
అమెరికా గాయపడిన దేశం. అందువల్ల తమ జాగ్రత్తలు తాము తీసుకుంటున్నారు. గతంలో చేదు అనుభవాల దృష్ట్యా పగడ్బందీగా ఉంటున్నారు. దీనిపై షారూక్ ఖాన్ కూడా పెద్దగా పట్టించుకోడని తను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు సెలబ్రిటీలనైనా కొన్నిసార్లు ఇలాగే ప్రవర్తిస్తుంటారని చెప్పుకొచ్చారు. గతంలో తనకు కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైందనీ, కానీ దాని గురించి తను పెద్దగా బాధపడలేదన్నారు. విమానాశ్రయంలో వారి జాగ్రత్తలు వారు తీసుకుంటుంటారని అని తేల్చి చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తల్లిని చంపిన దోషులను కఠినంగా శిక్షించాలని... సీఎంకు రక్తంతో లేఖ