Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హారన్ నాట్ ఓకే.. హారన్ కొట్టారో... ఫైన్ కట్టాల్సిందే.. రూ.500 నుంచి రూ.5వేలకు తప్పదండోయ్!

రోడ్డు మీద వెళ్తున్నపుడు, ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు వెనకాల నుండి హారన్‌ సౌండ్ వినపడగానే చిరాకేస్తుంది. వెనక వాహనాలు ముందుకు దూసుకెళ్లాలని కీ కీ అని హారన్ మోత మోగిస్తుంటారు. అస్సలు వాహనాలు ముందుకు వెళ్లే

హారన్ నాట్ ఓకే.. హారన్ కొట్టారో... ఫైన్ కట్టాల్సిందే.. రూ.500 నుంచి రూ.5వేలకు తప్పదండోయ్!
, బుధవారం, 29 జూన్ 2016 (14:19 IST)
రోడ్డు మీద వెళ్తున్నపుడు, ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు వెనకాల నుండి హారన్‌ సౌండ్ వినపడగానే చిరాకేస్తుంది. వెనక వాహనాలు ముందుకు దూసుకెళ్లాలని కీ కీ అని హారన్ మోత మోగిస్తుంటారు. అస్సలు వాహనాలు ముందుకు వెళ్లే అవకాశం లేకపోయినా అది తెలిసి కూడా తమకు దారి ఇవ్వాలంటూ హారన్ కొట్టేవాళ్లు ఇకమీదట కాసులు చెల్లించుకోవాల్సిందే. నగరంలో పెరిగిపోతున్న శబ్ధకాలుష్యాన్ని అరికట్టేందుకు ఇటీవల హారన్ నాట్ ఓకే నినాదంతో పోలీస్‌శాఖ వాహనదారుల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టిన సంగతి విదితమే. 
 
అవసరం లేకపోయినా తరుచూ హారన్ కొట్టడం వల్ల శబ్ధ కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. అందుకే ఇలా అవసరం లేకపోయినా హారన్ కొట్టేవారికి రూ. 500 నుంచి రూ. 5వేల వరకు జరిమానా విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మల్టీ టోన్ ఎయిర్ హారన్లు బిగించే డీలర్లు, గ్యారేజి యజమానులకు లక్ష రూపాయలు కూడా వడ్డన పడే అవకాశం ఉంది. నిబంధనలను పాటించకపోతే మొదటిసారి రూ. 500, రెండోసారి అయితే వెయ్యి రూపాయల చొప్పున ప్రభుత్వం జరిమానా విధించనుంది.
 
ఏదైనా వాహనాన్ని ఓవర్ టేక్ చేయాలంటే హెడ్లైట్ ఫ్లాష్ చేయడంతో పాటు చిన్నగా ఒకసారి హారన్ కొడితే పర్వాలేదు గానీ, అనవసరంగా పదే పదే మోగించేవాళ్లకు మాత్రం భారీ జరిమానాలు తప్పవట. నివాస ప్రాంతాలతో పాటు సైలెంట్ జోన్లుగా పేర్కొనే ప్రాంతాలలో కూడా హారన్లు మోగించకూడదని ప్రభుత్వం సూచిస్తుంది. ప్రధానంగా స‍్కూళ్లు, ఆస్పత్రులు ఉన్నచోట హారన్ కొట్టకూడదన్న బోర్డులు ఉన్నా.. వాటిని ఎవరూ పట్టించుకోరు. ఇలాంటివాళ్లను అదుపుచేయడానికే జరిమానాలు విధించనున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించి, మోటారు వాహన చట్టానికి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో సవరణలు చేయాలని కేంద్రం తలపెడుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చురకలంటించిన ప్రధాని మోడీ: ట్విట్టర్లో సుబ్రహ్మణ్య స్వామి గీతోపదేశం...!