Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ప్లేన్‌లో పాట.. సోనూ నిగమ్ స్పందన: భారత్‌లో అసలైన అసహనం అంటే ఇదే!

ప్లేన్‌లో పాట.. సోనూ నిగమ్ స్పందన: భారత్‌లో అసలైన అసహనం అంటే ఇదే!
, శనివారం, 6 ఫిబ్రవరి 2016 (12:11 IST)
బాలీవుడ్ ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్.. ప్లేన్‌లో తను పాటలు పాడినందుకు జెట్ ఎయిర్ వేస్ సిబ్బందిని సస్పెండ్ చేయడంపై స్పందించాడు. జెట్ ఎయిర్ వేస్ విమానంలో తన ఫ్యాన్స్ కోసం పాటలు పాడానని చెప్పుకొచ్చాడు. 'భారత్‌లో అసలైన అసహనం అంటే ఇదే' అని అన్నాడు. విమానాల్లో చిన్న చిన్న సరదాలు జరుగుతూ ఉంటాయని, అంతమాత్రానికే సిబ్బందిపై సస్పెన్షన్ చేయాలా అంటూ ప్రశ్నించారు. 
 
జర్నీ హ్యాపీగా సాగుతుండగా, విమాన సిబ్బంది ఎలాంటి ప్రకటనలు చేయాల్సిన అవసరంలేని సమయంలోనే తాను విమానంలోని అడ్రెసింగ్ సిస్టమ్‌ని ఉపయోగించానని వివరించాడు. ఇలా చేయడం శిక్షించడమేనని సోనూ పేర్కొన్నాడు.
 
గతంలో విమానాల్లో పైలట్లు, సిబ్బంది ప్రయాణికులను ఉత్సాహపరిచేందుకు సరదాగా జోక్స్ వేసుకోవడం కూడా తాను చూశానని చెప్పాడు. అంతేగాక ఓసారి విమానంలోనే పెద్ద ఎత్తున ఫ్యాషన్ షో నిర్వహించడం కూడా చూశానని వెల్లడించాడు. అటువంటిది ప్రయాణికులు అభిమానంతో అడిగినందుకు తాను పాట పాడితే సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగించడం దారుణమంటూ ఖండించాడు.

Share this Story:

Follow Webdunia telugu