Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమీర్ ఖాన్‌కు షాకుల మీద షాకులు: స్నాప్ డీల్ నుంచి అవుట్

అమీర్ ఖాన్‌కు షాకుల మీద షాకులు: స్నాప్ డీల్ నుంచి అవుట్
, శనివారం, 6 ఫిబ్రవరి 2016 (10:57 IST)
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌కు వరుస షాక్‌లతో దిమ్మతిరిగిపోతోంది. మొన్న ఇన్‌క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా కాంట్రాక్ట్ చేజార్చుకున్న అమీర్‌కు ఇప్పుడు స్నాప్ డీల్ షాకిచ్చింది. ప్రముఖ ఆన్‌లైన్ విక్రయ సంస్థ స్నాప్‌డీల్‌ అమీర్ ఖాన్ తమ సంస్థ ప్రచార కర్తగా కొనసాగించేందుకు ఇష్టపడటం లేదు. స్నాప్ డీల్‌తో అమీర్ కాంట్రాక్టు జనవరి 31తో ముగిసింది. 
 
అమీర్‌ను మరో ఏడాది బ్రాండ్ అంబాసిడర్‌గా పొడిగించుకునే అవకాశం ఉన్నప్పటికీ మూడు నెలల క్రితం దేశంలో మత అసహనం పెరిగిపోతోందని, దేశంనుండి విడిచిపొదామని తన భార్య కిరణ్ రావు కోరిందని అమీర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపింది. అమీర్ వ్యాఖ్యలపై నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్నాప్ డీల్ ఆప్‌ను తొలగించి నిరసన తెలియజేశారు. 
 
ఈ పరిణామాల నేపథ్యంలో స్నాప్ డీల్ సంస్థ ఆయన కొనసాగితే నష్టం తప్పదనే భావనకు వచ్చిఈ నిర్ణయం తీసుకున్నట్లు తేటతెల్లమవుతుంది. ఇదిలా ఉంటే మరో వైపు...అమీర్ ఖాన్ వ్యాఖ్యల వల్ల ఏర్పడిన వివాదం ఎఫెక్టుతో ఆయన్ను ఇన్‌క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా తొలగించిన సంగతి అందరికి తెలిసిందే.
 
ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా బ్రాండ్‌ అంబాసిడర్‌గా సుమారు పదేళ్ళపాటు అమీర్‌ఖాన్‌ కొనసాగించాడు. ఈ విషయంపై ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ శాఖ కార్యదర్శి అమితాబ్ కాంత్ మాట్లాడుతూ... బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌ భారత్ బ్రాండ్‌కు నష్టం కలిగించారని, అందు వల్లే ఆయన్ని ఇన్‌క్రెడిబుల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా తొలగించామని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu